Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాలి కూతురి పెళ్లిలో చిందులు: తమన్నాకు రూ.70లక్షలు.. రకుల్‌కి రూ.20 లక్షలు..

మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహం బెంగళూరు ప్యాలెస్‌లో బుధవారం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్ళికి రాజకీయ, సినీ ప్రముఖులేవరూ హాజరు కాలేదు. సినీ నటులలో బ్రహ్మానం

Advertiesment
Rakul Preet and Tamanna Dance at Gali Janardhan Reddy Daughter Wedding
, శుక్రవారం, 18 నవంబరు 2016 (12:14 IST)
మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహం బెంగళూరు ప్యాలెస్‌లో బుధవారం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్ళికి రాజకీయ, సినీ ప్రముఖులేవరూ హాజరు కాలేదు. సినీ నటులలో బ్రహ్మానందం, సాయి కుమార్, అతని కుమారుడు ఆది, సుమన్, తమన్నా, విశాల్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఎంతో మందిని గాలి ఆహ్వానించినా కొందరు మాత్రమే హాజరయ్యారు. 
 
పెళ్ళిలో పసిడి వెలుగులు, గాన భజానాలు, టాలీవుడ్ నుండి సునీత, గీత మాధురి, కృష్ణ చైతన్య వంటి సింగర్లు, బాలీవుడ్ నుండి కొండలు సింగర్ల హంగామా, రష్యన్ డాన్సర్ల చిందులు వెరసి ఒక రేంజ్‌లో జరిగింది. ఇంకా ఈ వేడుకలో తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సౌత్ మొత్తంతో పాటు నార్త్ లోనూ క్రేజ్ ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నాకి.. బ్రాహ్మణి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసేందుకు 70 లక్షల రూపాయలు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. 
 
టాలీవుడ్ బ్యూటీగా ఓ రేంజ్‌కి చేరి.. ఇతర ఇండస్ట్రీలపై ఇప్పుడిప్పుడే కన్నేసిన రకుల్ ప్రీత్ సింగ్‌కి కూడా ఫ్యాన్సీ ఆఫరే దక్కిందట. ఈ భామకు ఒక్క షోకి గాను రూ.20 లక్షలు ముట్టాయని టాక్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ప్రేమికులకు తీపి కబురు: పాత నోట్లు తీసుకుంటున్నారట.. కానీ చిల్లర మాత్రం ఇవ్వరట..