Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేనో చైన్ స్మోకర్... మద్యం బానిసను... ఆయన వల్లే వాటికి దూరమయ్యా : రజినీకాంత్

సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా అంటేనే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన నటించిన 'కబాలి' చిత్రం సందర్భంగా కూడా మరోసారి ఆయన సినిమాకున్న క్రేజ్ ఎలాంటిదో చూసే అవకాశం దక్కింది. ఓ

నేనో చైన్ స్మోకర్... మద్యం బానిసను... ఆయన వల్లే వాటికి దూరమయ్యా : రజినీకాంత్
, మంగళవారం, 1 నవంబరు 2016 (15:28 IST)
సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా అంటేనే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన నటించిన 'కబాలి' చిత్రం సందర్భంగా కూడా మరోసారి ఆయన సినిమాకున్న క్రేజ్ ఎలాంటిదో చూసే అవకాశం దక్కింది. ఓ సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయి వరకు ఎదిగిన రజినీకాంత్ జీవితం ఎందరికో ఆదర్శం. ప్రపంచవ్యాప్తంగా రజినీకాంత్‌కు అభిమానులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తి గతంలో పెద్ద చైన్ స్మోకర్. అలాగే ఆల్కహాల్ కూడా బాగా సేవించేవారట. 
 
ఒక విధంగా చెప్పాలంటే... రజినీ ఒకప్పుడు వీటికి బానిసలా మారిపోయారట. చెడు అలవాట్లకు బాగా అలవాటు పడిపోయిన తనలో మార్పు తీసుకొచ్చి... తనను సరైన దారిలో నడిపాడో ఓ వ్యక్తి. ఆయనెవరో కాదు సీనియర్ నటుడు శివకుమార్. కోలీవుడ్‌లో గొప్పపేరు సంపాదించుకున్న హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు. ఇటీవలే శివకుమార్ 75వ జన్మదినోత్సవం చేసుకున్న నేపథ్యంలో తనపై ఆయన ప్రభావాన్ని గుర్తు చేస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు సూపర్ స్టార్ రజినీకాంత్.
 
అందులో ఆయనేమన్నారంటే..''శివకుమార్ గారి నుంచి కెరీర్ తొలి రోజుల్లో ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను. అప్పట్లో నేను ఆల్కహాల్.. సిగరెట్లు మోతాదుకు మించి తీసుకునేవాడిని. అయితే గొప్ప నటుడిగా ఎదగాలంటే అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని శివకుమార్ నన్ను హెచ్చరించేవారు. ఆయనది మహోన్నత వ్యక్తిత్వం. చెడు అలవాట్లతో నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. అయితే ఆయనవల్ల ఆ అలవాట్లకు దూరమయ్యాను. ఆయన ఇచ్చిన సలహాలు పాటించి శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారయ్యాను. శివకుమార్ గారికి దేవుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నా'' అని రజినీ పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా కలల హీరో కమల్ హాసన్ నుంచి విడిపోతున్నా.. నటి గౌతమి :: శృతిహాసనే కారణమా?