Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజినీకాంత్ 'కబాలి' చిత్రానికి చిక్కులు.. విడుదలకు ముందే ఫైనాన్షియర్ల పేచీ!

Advertiesment
రజినీకాంత్ 'కబాలి' చిత్రానికి చిక్కులు.. విడుదలకు ముందే ఫైనాన్షియర్ల పేచీ!
, శుక్రవారం, 6 మే 2016 (21:10 IST)
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు సినిమా విడుదలకు కొన్ని కష్టాలు మామూలుగానే వస్తుంటాయి. ఈసారి కూడా అది జరిగే అవకాశముందని కోలీవుడ్‌ ఇండస్ట్రీ భావిస్తోంది. సొంత సినిమాతోపాటు 'లింగా'.. సినిమా ప్లాప్‌ కావడంతో.. ఆ చిత్రాల ఫైనాన్సియర్లు తాజాగా 'కబాలి' సినిమా విడుదల ముందు పేచీ పెట్టనున్నారనే వార్తలు కోడంబాక్కం వర్గాల సమాచారం. 
 
రజినీ, కొత్త దర్శకుడు ప.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కబాలి'. ఈ చిత్రం వచ్చేనెలలో విడుదలకానుంది. తమిళంతో పాటుగా తెలుగులోను ఈ సినిమా అదే పేరుతో విడుదల కానుంది. కాగా, గతంలో తెలుగులో 'రోబో' రైట్స్‌ రూ.27 కోట్లు పలకగా, 'కబాలి' తెలుగు రైట్స్‌ 31 కోట్లకి అమ్ముడైనట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. 
 
ప.రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ఫస్టులుక్‌‌కీ.. ఇటీవల రిలీజ్‌ చేసిన టీజర్‌‌కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చింది. మరి సినిమా విడుదలకు ముందు ఎటువంటి పేచీలేకుండా చూడాలని రజినీ భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడో భార్యతో కలిసి హాలిడే టూర్‌కు వెళ్ళనున్న పవన్ కళ్యాణ్!