Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆన్‌లైన్‌లో రజినీకాంత్ 'కబాలి' ఫుల్‌మూవీ లీకయ్యిందట... డార్క్ వెబ్ సైట్‌లో?

సూపర్‌స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం 'కబాలి' ఈనెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత కలైపులి ఎస్. థాను భారీ బడ్జెట్ వ్యయంతో తెరకెక్కించారు

ఆన్‌లైన్‌లో రజినీకాంత్ 'కబాలి' ఫుల్‌మూవీ లీకయ్యిందట... డార్క్ వెబ్ సైట్‌లో?
, మంగళవారం, 19 జులై 2016 (16:11 IST)
సూపర్‌స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం 'కబాలి' ఈనెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత కలైపులి ఎస్. థాను భారీ బడ్జెట్ వ్యయంతో తెరకెక్కించారు. 
 
అయితే, ఈ చిత్రాన్ని విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ కాకుండా అడ్డుకోవాలంటూ నిర్మాత కలైపులి ఎస్ థాను హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 225 వెబ్ సైట్లు, మరికొన్ని డౌన్ లోడింగ్ పైరసీ సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
 
అయితే, డార్క్ వెబ్‌సైట్లో ఈ చిత్రానికి సంబంధించిన అనేక లీకులు ఉన్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ లింకులను తీసేయాల్సిందిగా తాము సైబర్ నేర విభాగాన్ని కోరినట్లు చిత్రబృందం తెలిపింది. అయితే ఈ వ‌దంతులు సినిమా క‌లెక్ష‌న్ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌వ‌ని యూనిట్ స‌భ్యులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి 'కత్తి'కి పదును పెడుతున్న రచయిత ఎవరు? పరుచూరి బ్రదర్స్ సంగతేంటి?