రాజశేఖర్‌తో వెంకీ మల్టీస్టారర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన వెంకటేశ్ త్వరలో గరుడ వేగతో హిట్ కొట్టిన హీరో రాజశేఖర్‌తో కలిసి నటించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వస్తోంది. తేజ దర్శకత

బుధవారం, 29 నవంబరు 2017 (17:39 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన వెంకటేశ్ త్వరలో గరుడ వేగతో హిట్ కొట్టిన హీరో రాజశేఖర్‌తో కలిసి నటించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వస్తోంది. తేజ దర్శకత్వంలో వెంకీ త్వరలో సినిమా చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. 
 
నేనే రాజు నేనే మంత్రి సినిమాకు తర్వాత తేజ దగ్గుబాటి మరో హీరో అయిన వెంకీతో సినిమా చేయాలని ప్లాన్ చేసేసుకున్నారు. స్క్రిప్ట్ కూడా వెంకీకి నచ్చేయడంతో అతని సినిమాకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు.

ఇందులో భాగంగా నటీనటుల ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో వెంకీ బావగా ఈ చిత్రంలో రాజశేఖర్ కనిపిస్తారట. ఈ రోల్ ఈ సినిమాకు కీలకమైందని.. అందుకే తేజ రాజశేఖర్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నాకున్న వీక్‌నెస్ అదే.. ఏదడిగినా ఇచ్చేస్తాను: శ్రుతి హాసన్