దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి వీక్‌నెస్ ఏంటో తెలుసా?
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. కాగా చిత్ర షూటింగ్‌లో ఈ దర్శకుడు తాను అనుకున్నది అనుకున
'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి 2' సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. కాగా చిత్ర షూటింగ్‌లో ఈ దర్శకుడు తాను అనుకున్నది అనుకున్నట్టు తెరపై రాకపోతే అస్సలు కాంప్రమైజ్‌కాడట. అవసరమైతే మరికొన్ని రోజులు షూటింగ్ పొడిగించి అయినా ఆ సన్నివేశాన్ని తనకు నచ్చినట్టుగా చిత్రీకరిస్తాడట.
అంతటి టాలెంట్ ఉన్న దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి కూడా ఒక బలహీనత ఉందట. ఈ విషయన్నిఆయనే స్వయంగా వెల్లడించాడు. ఇంతకీ రాజమౌళి వీక్‌నెస్ ఏంటో తెలుస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అదేంటంటే... కామెడి సినిమాలు చేయడం రాజమౌళికి తెలియదట. హాస్య చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం నా వల్ల కాదు అంటూ ఇటీవల జరిగిన ఓ ఆడియో ఫంక్షన్‌లో వెల్లడించాడు.
యుద్ధ సన్నివేశాలకు అవలీలగా దర్శకత్వం వహించే జక్కన్న అదే రీతిలో సెంటిమెంట్‌ని కూడా బాగా పండించగలడు. కానీ కామెడీ పండించడం రాదంటే నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ...