Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ ఛాన్స్ అడిగితే లైంగిక సుఖం ఇవ్వమని అడుగుతున్నారు.. : లక్ష్మీ రాయ్ బాంబు

లక్ష్మీరాయ్ లేదా రాయ్ లక్ష్మీ ఇలా ఏ పేరు పెట్టుకున్న ఆమెకు అదృష్టం కలిసిరావడం లేదు. ఐటం సాంగ్‌లకు వస్తున్న పేరు... సోలో హీరోయిన్‌గా సెటిల్ కాలేకపోతోంది. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150

Advertiesment
సినీ ఛాన్స్ అడిగితే లైంగిక సుఖం ఇవ్వమని అడుగుతున్నారు.. : లక్ష్మీ రాయ్ బాంబు
, గురువారం, 18 మే 2017 (07:28 IST)
లక్ష్మీరాయ్ లేదా రాయ్ లక్ష్మీ ఇలా ఏ పేరు పెట్టుకున్న ఆమెకు అదృష్టం కలిసిరావడం లేదు. ఐటం సాంగ్‌లకు వస్తున్న పేరు... సోలో హీరోయిన్‌గా సెటిల్ కాలేకపోతోంది. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150"లో రత్తాలు రత్తాలు అనే ఐటం సాంగ్‌లో తన అంద చందాలను ఆరబోసి, చిరంజీవి పోటీ పడి డ్యాన్స్ చేసినప్పటికీ.. ఛాన్సులు మాత్ర కరవయ్యాయి. 
 
పైగా, ఛాన్స్ ఇవ్వమని తెలిసిన నిర్మాతను అడిగితే ఆయన మరో విధంగా లబ్ది చేకూర్చమని అడుగుతున్నారట. ఆ తర్వాత సినీ ఛాన్స్ గురించి ఆలోచన చేస్తానని ముఖాన్నే చెపుతున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక కెరీర్‌ను కష్టంతో సాగదీస్తోంది. 
 
ఇదే అంశంపై లక్ష్మీరాయ్ స్పందిస్తూ.. "ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తమ్మాయిలు, హిట్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్న హీరోయిన్లను నిర్మాతలు, ఫిల్మ్‌ మేకర్స్‌ పీడిస్తున్నారు. కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ ఇండస్ట్రీకి సరాదాల కోసం, సుఖాలు అనుభవించడం కోసం (స్లీప్‌ అరౌండ్‌) వస్తారు" అని మొహమాటం లేకుండా ఇండస్ట్రీ తీరును ఎండగట్టారు. 
 
"తమ సుఖాల కోసం పేరున్న ఆర్టిస్టులను కూడా వీళ్లు వదలడం లేదు. తమతో పడక పంచుకోవడానికి నిరాకరించిన ఆర్టిస్టులను కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ సినిమా నుంచి తప్పిస్తున్నారు" అని బోల్డ్‌గా చెప్పేశారీ బ్యూటీ. ‘కాస్టింగ్‌ కౌచ్ (అవకాశాల కోసం అమ్మాయిలు లైంగిక సుఖాలు అందించడం)‌’ అన్ని ఇండస్ట్రీలలోనూ ఉందన్నారు. నిజం చెప్పాలంటే తనకెప్పుడూ అటువంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయన అందగాడు.. ఈయన సోదరుడు.. ఒక్కమాటలో తానెటువైపో తేల్చిపడేసిన అనుష్క