Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చార్మీ 'మత్తు'లో నా భర్త జీవితం నాశనమైంది : వాపోతున్న లావణ్య

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో టాలీవుడ్ టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ పాత్ర ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఈ కేసులో పూరీ తర్వాత విచారణను ఎదుర్కొన్న సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు... పూరీ

Advertiesment
చార్మీ 'మత్తు'లో నా భర్త జీవితం నాశనమైంది : వాపోతున్న లావణ్య
, శుక్రవారం, 21 జులై 2017 (10:23 IST)
హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో టాలీవుడ్ టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ పాత్ర ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఈ కేసులో పూరీ తర్వాత విచారణను ఎదుర్కొన్న సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు... పూరీకి డ్రగ్స్ అలవాటు ఉందని, చార్మితో పాటు.. పలువురు స్నేహితులు, నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేసేవాడనీ వెల్లడించాడు. దీంతో డ్రగ్స్ కేసులో పూరీ ఇరుక్కున్నట్టే. 
 
ఈ నేపథ్యంలో పూరీ భార్య లావణ్య బోరున విలపిస్తోంది. తన భర్త మత్తుమందుల కేసులో ఇరుక్కోవడానికి హీరోయిన్ చార్మీయే కారణమని వాపోతోంది. తనకు తెలిసిన పరిశ్రమ పెద్దల వద్ద బాధపడినట్టు సమాచారం. ఆమెను పరామర్శించేందుకు వెళ్లిన వారి వద్ద కన్నీటిపర్యంతమైన లావణ్య.. చార్మీతో ఉన్న అనుబంధం కారణంగానే తన భర్త ఫెయిల్యూర్ల బాటలో ఉన్నాడని, ఆర్థికంగా దెబ్బతిని, సర్వనాశనం కావడానికి కూడా ఆమే కారణమని చెప్పినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
అంతేకాకుండా, చార్మి సోదరులకు పంజాబ్‌లోని డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తను వాడుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు చార్మి యత్నించిందని, ఆమె మత్తులో పడిన పూరీ ఆసలు సమస్యను విస్మరించాడని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ రాక్షసితో కలవద్దని చెప్పినందుకు ఇంటికి రావడం కూడా మానేశాడని లావణ్య వాపోయిందట. ఇంత రాద్ధాంతం అవుతున్నా, తన కుటుంబ జీవితం చెడిపోరాదన్న ఉద్దేశంతో భర్తను ఒక్క మాట కూడా అనలేదని లావణ్య చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు లావణ్య వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'డ్రగ్స్' విచారణకు నటుడు సుబ్బరాజు.. సిట్ ఆఫీసర్లు సినిమా చూపిస్తారా?