డ్యాన్స్ షోలో మనసుపడిన కుర్రోడిని పెళ్లాడనున్న ప్రియమణి.. రిజిస్ట్రేషన్ ఆఫీసులో...
ప్రియమణి.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి. అలాగే, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈమె నటించింది. ఈ నటి త్వరలోనే పెళ్లిపీటలనెక్కనుంది. ఆమెకు కాబోయే వరుడు ఎవరో తేలుసా? ఓ డ్యాన్స్ మా
ప్రియమణి.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి. అలాగే, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈమె నటించింది. ఈ నటి త్వరలోనే పెళ్లిపీటలనెక్కనుంది. ఆమెకు కాబోయే వరుడు ఎవరో తేలుసా? ఓ డ్యాన్స్ మాస్టర్. అతనిపై ఓ డ్యాన్స్‌లో మనసు పారేసుకుంది. ఇపుడు అతని చేయిపట్టుకునే ఏడడుగులు నడవనుంది. ఇంతకీ ప్రియమణి చేసుకోబోయే కుర్రోడి పేరు ముస్తఫా రాజ్.
ఈనెల 23వ తేదీన ముస్తఫా రాజ్‌ను ప్రియమణి పెళ్లి చేసుకోనుంది. నిజానికి ఈ వివాహం చాలా గ్రాండ్‌గాకాకుండా, రిజిస్ట్రేషన్ ఆఫీసులో సింపుల్‌గా జరుపుకోనున్నారట. పెళ్లి తర్వాత మాత్రం స్టార్ హోటల్‌లో చాలా గ్రాండ్‌గా రిసెప్షన్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.
ప్రియమణి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముస్లీం కావడంతో వారి ప్రేమను లవ్-జీహాద్ పేరుతో పలువురు నెటిజన్లు కామెంట్స్ పెట్టారట. దీంతో ప్రియమణి కాస్త అసహనానికి గురైంది. పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకండి. మీ కామెంట్లతో చిరాకు వస్తోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోన్నాని, వీలైతే ఆశీర్వదించండి కానీ మనసుకు ఇబ్బంది పెట్టే కామెంట్స్ వద్దంటూ కాస్త కఠువుగానే వార్నింగ్ ఇచ్చింది.