రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు ఇప్పుడు స్పీడ్‌గా చేసేస్తున్నాడు. బాహుబలికి ఏళ్ళ తరబడి గేప్ తీసుకున్న ఆయన రాధేశ్యామ్ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే కరోనా వల్ల అవి సగం పూర్తయి, పూర్తయిన రాదేశ్యామ్ విడుదలకాక గూడ్స్ బండిలా సాగుతోంది. కానీ ప్రభాస్ కెరీర్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు చేసే ప్రభాస్‌కు చిన్న సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. దీనికి మారుతీ దర్శకుడిగా వున్నారు. ఇప్పటికే కథను కొంత చెప్పడంతో పూర్తి స్క్రిప్ట్ అయ్యాక మరోసారి కలవాలను చెప్పాడట.
అయితే ముందుగానే ప్రభాస్ డేట్‌ను బుక్ చేసేశాడు ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య. ఇప్పటికే 50 కోట్లు అడ్వాన్స్‌గా ప్రభాస్ కు ఇచ్చాడని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మారుతీ దర్శకత్వంలో రాబోయే సినిమా రాజుడీలక్స్ అనే హార్రర్ మూవీ. ఇలాంటి కాన్‌సెప్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ వుందట. అందుకే ఏరికోరి ఇటువంటి కథను ఎంచుకున్నాడని తెలుస్తోంది. ఇక మారుతీ చేసిన `పక్కా కమర్షియల్` సినిమా విడుదలకు సిద్ధం కానుంది. చిన్న బడ్జెట్ సినిమాలకోసం మారుతీ నిర్మాణ సంస్థను కూడా స్థాపించాడు. ప్రభాస్ చేయబోయే సినిమాలోకూడా ఆయన భాగస్వామి కానున్నట్లు సమాచారం.