అందాలు చూపిస్తే చూస్తున్నారు కదా.. బికినీ వేస్తే తప్పేంటి? : పూజా హెగ్డే (Video)
వెండితెరపై అందాలు ఆరబోస్తే సినిమా చూడకుండా థియేటర్ల నుంచి లేచి బయటకు వస్తున్నారా? లేదు కదా.. అలాంటిదిమరి బికినీ వేస్తే తప్పేంటి అని దువ్వాడ జగన్నాథం హీరోయిన్ పూజా హెగ్డే ప్రశ్నిస్తోంది.
వెండితెరపై అందాలు ఆరబోస్తే సినిమా చూడకుండా థియేటర్ల నుంచి లేచి బయటకు వస్తున్నారా? లేదు కదా.. అలాంటిదిమరి బికినీ వేస్తే తప్పేంటి అని దువ్వాడ జగన్నాథం హీరోయిన్ పూజా హెగ్డే ప్రశ్నిస్తోంది. డీజే (దువ్వాడ జగన్నాథం)లో పూజా స్కిన్‌షో మరీ ఎక్కువవడంతో సెన్సార్ వాళ్లు ఆ సీన్‌ను బ్లర్ కూడా చేశారు. అయినా పూజా అందాలు కుర్రకారును బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పూజకు వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయంటే దానికి ‘డీజే’లో గ్లామర్ షోయే కారణం.
దీనిపై ఆమె స్పందిస్తూ... డీజే చిత్రంలోని ‘ఆ సీన్‌లో హీరోయిన్ అలా కనబడటం అవసరం. అందుకే నేను బికినీ వేయడానికి అంగీకరించా. అది సరైన నిర్ణయమే. అవసరమైతే తెరపై గ్లామరస్‌గా కనబడటానికి నేను ఎప్పుడూ సిద్ధమేన’ని ప్రకటించింది పూజ. ఈ ముద్దగుమ్మ త్వరలో మహేష్, బెల్లంకొండ శ్రీనివాస్‌ల సరసన మెరవనుంది.