Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నయ్యతో కలిసి సినిమానా... హహ్హహ్హ్హ... పగలబడి నవ్విన పవన్ కళ్యాణ్

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేయనున్నట్లు టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించడం.. వారిద్దరినీ వేర్వేరుగా కలవడం జరిగిందే. త్రివిక్రమ్‌ దర్శకుడని కూడా ప్రకటించారు. కానీ ఈ చిత్రం కార్యరూపం దాల్చే దిశలో లేదని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో అమితాబ్‌ను

Advertiesment
pawan kalyan laughs
, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (18:48 IST)
చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేయనున్నట్లు టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించడం.. వారిద్దరినీ వేర్వేరుగా కలవడం జరిగిందే. త్రివిక్రమ్‌ దర్శకుడని కూడా ప్రకటించారు. కానీ ఈ చిత్రం కార్యరూపం దాల్చే దిశలో లేదని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో అమితాబ్‌ను కూడా పెట్టాలనే ఆలోచనలో వున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పవన్‌ రాజకీయ నేపథ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల ఇది జరిగేపని కాదని తెలుస్తోంది. తాను సినిమా చేస్తున్నట్లు టి.సుబ్బిరామిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు మినహా.. హీరోలిద్దరూ ఎక్కడా ప్రకటనలో పేర్కొనలేదు. 
 
కాగా, చిరంజీవి చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌లో ప్రముఖ హీరోలను తీసుకువస్తున్నట్లు చిరు ప్రకటించాడు. కానీ పవన్‌ కళ్యాణ్‌ విషయం క్లారిటీ ఇవ్వలేదు.  బుల్లితెరపైనే కలవలేనివారు.. వెండితెరపై ఎలా కలుస్తారనే శంక ఫ్యాన్స్‌లోనూ వున్నా పైకి మాత్రం ఇది ఖచ్చితంగా వర్కవుట్‌ అవుతుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ తాజాగా యూఎస్‌ పర్యటనలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ మాత్రం విలేఖరుల నుండి మీరు మీ అన్నయ్యతో కలిసి సినిమా చేస్తున్నారా అనే ప్రశ్న రాగానే నవ్వుతూనే అలాంటి ప్రస్తావనేదీ నా దగ్గరకు రాలేదని చెప్పడం విశేషం. దాంతో సినిమాలో నీలిమేఘాలు ఆవహించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలరంగు పంచెకట్టు.. కనిపిస్తే ఎత్తుకెళ్లిపోతారు..?