పవన్ కళ్యాణ్ కూడా బాలయ్యలా మారిపోతున్నాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణలా మారిపోతున్నారని సినీ జనం చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనే అనుమానం రావచ్చు. అదే సినిమాల సెలక్షన్. సినిమా కథలు చెప్పేటప్పుడు డైరెక్టర్ ఏదో నాలుగు పవర్ ఫుల్ డైలాగులు, రెండు మంచి సీన్లు చెప్పగానే బాలయ్య ఓకే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణలా మారిపోతున్నారని సినీ జనం చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనే అనుమానం రావచ్చు. అదే సినిమాల సెలక్షన్. సినిమా కథలు చెప్పేటప్పుడు డైరెక్టర్ ఏదో నాలుగు పవర్ ఫుల్ డైలాగులు, రెండు మంచి సీన్లు చెప్పగానే బాలయ్య ఓకే చెప్పేస్తారని ఇండస్ట్రీలో టాక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే మారిపోయారనే మాటలు వినిపిస్తున్నాయి. అందువల్లనే రీమేక్ చిత్రాలతో కాలక్షేపం చేస్తున్నారని అంటున్నారు.
కొత్త సబ్జెక్టులను తీసుకుని వాటినో సవాలుగా చేయాలని ఆలోచన చేయకుండా ఎక్కడో హిట్ అయిన చిత్రాన్ని పట్టుకుని దానికి అటుఇటు మార్పులు చేసి నటించేస్తున్నాడనీ, ఆ సినిమా తెలుగు నేటివిటీకి సరిపడక ఒక్కోసారి బోల్తా కొడుతున్నాయని అంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య తదితర నటులు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారో అలాగే పవన్ కళ్యాణ్ తీసుకోవాలంటున్నారు. రీమేక్ కథల విషయంలో అన్నయ్య చిరును ఫాలో అయితే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో వెయిట్ అండ్ సీ.