Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాన్‌ ఇండియా సినిమాలకు ఓటీటీ మొండిచెయ్యి?

Advertiesment
dasara, tiger, spy
, బుధవారం, 1 నవంబరు 2023 (10:15 IST)
dasara, tiger, spy
ప్రస్తుతం తెలుగులో పాన్‌ ఇండియా సినిమాల పేరుతో అగ్రహీరోలందరూ ముందువరుసలో వున్నారు. వారు చేసే సినిమాలన్నీ సౌత్‌ లాంగ్వేజ్‌లతోపాటు హిందీలోనూ విడుదల చేయడానికి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు దర్శక నిర్మాతలతో ముందుగానే హీరోలు చెప్పేస్తున్నారు. దాంతో వందలకోట్ల రూపాయలతో నిర్మాతలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవడం తెలిసిందే. అయితే పాన్‌ ఇండియా అనేది ఇప్పుడు బెడిసి కొడుతోంది. అందుకు కారనం ఓటీటీ సంస్థలు వెనకడుగు వేయడమే ప్రధాన కారణం.
 
సినిమా విడుదలయ్యాక చాలా మటుకు డిజాస్టర్‌లు, బిలో ఏవరోజ్‌లు వుండడంతో థియేటర్లలో ఆడని సినిమాలను ఓటీటీ సంస్థలు తీసుకునేందుకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. అందులో ప్రధానంగా నాని నటించిన దసరా, రవితేజ నటించిన టైగర్‌ నాగేశ్వరరావు, రామ్‌ నటించిన స్కంద సినిమాలతో పాటు పలు పెద్ద హీరోల సినిమాలు కూడా వున్నాయి. అందులో ముఖ్యంగా కార్తికేయ2తో పాన్‌ ఇండియా హీరోగా మారిన నిఖిల్‌ ఆ సినిమా విజయం తర్వాత చాలా ఆనందంగా వున్నాడు. అందుకే అతనితో స్పై అనే సినిమాను ఆ చిత్రనిర్మాతలు పాన్‌ ఇండియా సినిమాగా తీశారు. కానీ అది డిజాస్టర్‌గా నిలిచింది.

ఆ తర్వాత ఆ సినిమాను ఏ ఓటీటీ కూడా తీసుకోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేయలేకపోయింది. అయితే పనిలోపనిగా మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ కూడా పెద్దగా థియేటర్లలో ఆడలేదు. కానీ ఆ సినిమాను అతి కష్టంమీద ఓటీటీలో వచ్చేలా అల్లు అరవింద్‌ వేసిన స్కెచ్‌తో సెట్‌ అయిందనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఏది ఏ ఏమైనా తెలుగులో ప్రతి సినిమాను పాన్‌ ఇండియాగా తీయడం సరైన పద్దతికాదని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిర్మాతలు ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సినిమాకు సీక్వెల్‌ గా చిరంజీవి 156 ` కోలుకున్న తర్వాత షూట్‌లోకి వెళ్లనున్న చిరంజీవి?