Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవకాశాలు లేవని బోరున విలపిస్తున్న గోవా బ్యూటీ...

సాధారణంగా హీరోయిన్లకు కొంతవరకే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి సిల్వర్ స్క్రీన్‌కు అలవాటుపడిన హీరోయిన్లు... వెండితెరకు దూరమయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడరు. ఇలాంటివారిలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. ప్రస్తుతం దక్షిణ

Advertiesment
Goa beauty Ileana
, గురువారం, 22 డిశెంబరు 2016 (12:25 IST)
సాధారణంగా హీరోయిన్లకు కొంతవరకే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి సిల్వర్ స్క్రీన్‌కు అలవాటుపడిన హీరోయిన్లు... వెండితెరకు దూరమయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడరు. ఇలాంటివారిలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు కరవయ్యాయి. దీనిపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంతకుముందు దక్షిణాది చిత్ర పరిశ్రమ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఈ గోవా సుందరిని తలపై ఎక్కించుకొని మోసింది. 
 
"నన్భన్‌" చిత్రంతో తమిళ సినీ ప్రేక్షకులను అలరించిన ఇలియానాకు ఆ సమయంలో పలు అవకాశాలు వచ్చాయి. అయితే అప్పుడు ఈ అమ్మడు బెట్టు చేసింది. బాలీవుడ్‌ మోజుతో దక్షిణాది చిత్రాలను తక్కువగా చూశారు. అయితే తాను ఊహించింది జరగలేదు. బాలీవుడ్‌ ఇలియానాను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ దక్షిణాదికే మకాం మార్చాలన్న ప్రయత్నాలు మొదలెట్టారు.
 
ఇటీవల ఈత దుస్తులతో అందాలారబోసిన ఫొటోలను ఇంటర్నెట్‌లో విడుదల చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దక్షిణాది సినిమా తనను పక్కన పెట్టేసిందని ఆవేదనను వ్యక్తంచేస్తున్నారు ఇలియానా. ప్రస్తుతం ఈ భామ ఏమంటున్నారో చూద్దాం. ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాలే చేస్తున్నాను. దక్షిణాదిలో ఒక్క అవకాశం కూడా రావడం లేదు. కారణం ఏమిటో తెలియడం లేదు. ఈ మధ్య ఒక తెలుగు దర్శకుడు వచ్చి కథ చెప్పారు. మా చిత్రంలో మీరే కథానాయకి అని నమ్మపలికారు. అంతే మళ్లీ కంట పడలేదు. ఇప్పుడా చిత్రంలో వేరే నటి నటిస్తున్నారు. నన్నెందుకు తొలగించారని నేనా దర్శకుడిని అడగ్గా సారీ అని ఫోన్‌ పెట్టేశారు.
 
నిజం చెప్పాలంటే నేను చేసిన చిత్రాలన్నీ ఇష్టపడి చేసినవే. అర్ధాంగీకారంతో ఏ చిత్రం చేయలేదు. హిందీలో బర్ఫీ చిత్రం నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. తర్వాత అక్షయ్‌కుమార్‌కు జంటగా నటించడం మంచి అనుభవం. నేను నటించిన ప్రతి చిత్రంతో చాలా నేర్చుకున్నాను. నటించిన సన్నివేశం పూర్తి కాగానే దర్శకుడి ముఖంలోకి చూస్తాను. ఆయనలో సంతోషం కనిపిస్తే నేను సంతృప్తి పడతాను. ఇక జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోను. దక్షిణాది దర్శక నిర్మాతల నుంచి మంచి పాత్రలో నటించే అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నారు. ఇది ఇలియానా ఎదురు చూపుల వేదన. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"కట్టప్పకు సమయం లేదు మిత్రమా"? క్రిష్ ముందు రాజమౌళి దిగదుడుపేనా?