Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి బాటలో హీరో నాని... రాజకీయాల్లోనా... సినిమాల్లోనా...?

నాని. తెలుగు సినీపరిశ్రమలో ఎలాంటి రెకమెండేన్ లేకుండా సొంత టాలెంట్‌తో పైకి వచ్చిన యువ హీరో. తక్కువ బడ్జెట్ తోనే నానితో సినిమాలు తీసి మంచి లాభాలను సంపాదించుకున్న దర్శక నిర్మాతలు ఉన్నారు. అష్టాచెమ్మాతో ఒక్కసారిగా క్రేజ్‌ను పెంచుకున్న నాని ఆ తరువాత పెద్ద

Advertiesment
nani latest movie news
, బుధవారం, 7 జూన్ 2017 (12:12 IST)
నాని. తెలుగు సినీపరిశ్రమలో ఎలాంటి రెకమెండేన్ లేకుండా సొంత టాలెంట్‌తో పైకి వచ్చిన యువ హీరో. తక్కువ బడ్జెట్ తోనే నానితో సినిమాలు తీసి మంచి లాభాలను సంపాదించుకున్న దర్శక నిర్మాతలు ఉన్నారు. అష్టాచెమ్మాతో ఒక్కసారిగా క్రేజ్‌ను పెంచుకున్న నాని ఆ తరువాత పెద్దగా విజయాలు లేక ఇబ్బందులు పడ్డాడు. అయితే ఈసారి ఎలాగైనా మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వెళ్ళాలన్నదే నాని ఆలోచన. అందుకే నాని ఇంకో మార్గాన్ని ఎంచుకున్నారు. అదే వచ్చిన సినిమాలనే రీమెక్ చేసుకోవడం. ప్రస్తుతం నాని హిట్ సినిమాల కోసం పడుతున్న పాట్లు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
 
నాని. సహజ నటుడు. కాలేజీ కుర్రాడుగా కనిపించే నానికి పెద్ద వయస్సే. పెళ్ళయి పిల్లలు కూడా వున్నారు. అయినా నాని మాత్రం యువకుడిలా కనిపిస్తాడు. సినీ పరిశ్రమలో నానికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం.. దర్శకనిర్మాతలు చెప్పినట్లు వినడం నానికి అలవాటు. అందుకే నానికి  సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. లక్కు దొరికినట్లు నినుకోరి సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమా మొత్తం 12 సంవత్సరాల హిందీలో వచ్చిన ఒక చిత్రాన్ని ఆధారంగా తీసుకున్నారట. ఆమధ్య చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రాన్ని కత్తి నుంచి తీసుకున్నట్లు నాని కూడా రీమేక్ చిత్రాన్ని చేస్తున్నాడట.
 
అప్పట్లో ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇదే విషయాన్ని నానికి చెబితే అబ్బా.. ఇక మనకు సినిమా హిట్టయినట్లేనని ఊపిరిపీల్చుకున్నాడట.  ఎంతో జోష్‌‌తో ఆ సినిమాలో నటిస్తున్నాడు నాని. హిట్ కోసమే రీమేక్ సినిమాల కోసం నాని ఆరాటపడుతున్నట్లు సినీపరిశ్రమ కోడై కూస్తోంది.. మరి చూడాలి... నాని ఆశ ఎంత మేరకు నెరవేరుతుందో..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్మాత సురేష్‌పై అవంతిక కేసు: పెర్మాఫ్మెన్స్ బాగా లేదని వేధిస్తున్నారు-చెక్ బౌన్స్‌పై అడిగితే..?