Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైతూ దంపతులకు నాగ్ ఇచ్చే వెడ్డింగ్ గిఫ్ట్ ఇదే...

టాలీవుడ్ ప్రేమజంట నాగ చైతన్య, సమంతలు వచ్చే నెలలో ఓ ఇంటివారు కానున్నారు. వీరిద్దరి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.

Advertiesment
చైతూ దంపతులకు నాగ్ ఇచ్చే వెడ్డింగ్ గిఫ్ట్ ఇదే...
, ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (13:51 IST)
టాలీవుడ్ ప్రేమజంట నాగ చైతన్య, సమంతలు వచ్చే నెలలో ఓ ఇంటివారు కానున్నారు. వీరిద్దరి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ జంట ఒకవైపు తమ సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు పెళ్ళికి షాపింగ్ చేస్తున్నారు. అయితే, కొద్ది రోజులుగా వీరి పెళ్ళికి సంబంధించి ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. 
 
తాజాగా సమంత - నాగచైతన్య జంటకి పెళ్ళి తర్వాత అక్కినేని నాగార్జున స్టన్నింగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడనే వార్త ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో కొత్త జంటకి మంచి కాటేజ్‌ని నిర్మించి వారి పెళ్లి కానుకగా ఇవ్వాలని నాగ్ భావిస్తున్నాడట. 
 
ఇందుకోసం పనులు కూడా మొదలు పెట్టాడట. అత్యంత ఖరీదైన మెటీరియల్‌తో దీనిని తయారు చేయిస్తున్నట్టు సమాచారం. కాటేజ్ పనులకి సంబంధించిన ఫోటో అంటూ ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ కాటేజ్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరిగే టైంలో అక్కడే బస చేసేందుకు వీలుగా నిర్మిస్తున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'దేవసేన'కు వివాహం.. ఎపుడు?