Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయిల గురించి ఈ బుడతడకేం తెలుసు... ఆ విషయంలో నేనొప్పుకోను : నాగార్జున

అమ్మాయిల గురించి, వారి మనస్తత్వాల గురించి మావోడు నాగ చైతన్యకేం తెలుసు.. నన్ను అడగండి.. నేను చెపుతా అంటున్నారు టాలీవుడ్ మన్నథుడు అక్కినేని నాగార్జున. అంతేనా... అమ్మాయి గురించి చైతూ చెప్పిన విషయంపై తాను

Advertiesment
Rarandoi Veduka Chuddam Audio Launch
, సోమవారం, 22 మే 2017 (15:49 IST)
అమ్మాయిల గురించి, వారి మనస్తత్వాల గురించి మావోడు నాగ చైతన్యకేం తెలుసు.. నన్ను అడగండి.. నేను చెపుతా అంటున్నారు టాలీవుడ్ మన్నథుడు అక్కినేని నాగార్జున. అంతేనా... అమ్మాయి గురించి చైతూ చెప్పిన విషయంపై తాను ఏకీభవించడం లేదని తేల్చి చెప్పారు. ఇంతకీ.. అమ్మాయిల గురించి చైతూ ఏమన్నాడు.. నాగార్జున ఏమమని చెప్పాడో పరిశీలిద్దాం.
 
నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం "రారండోయ్ వేడుక చూద్దాం". ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ఆడియో వేడుక జరిగింది. ఈ ఆడియో వేడుకలో నాగార్జున మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చివర్లో ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అని చైతన్య చెప్పేదాన్ని తాను ఒప్పుకోనని స్పష్టం చేశాడు. 
 
ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతందని చెప్పడానికి కారణం చాలామంది ఉన్నారని, వాళ్లలో మొదటి వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్ అని నాగ్ చెప్పాడు. బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశాడని, ఈ సినిమాతో దేవిశ్రీకి హ్యాట్రిక్ ఖాయం అని నాగార్జున అన్నాడు. ఇక తర్వాతి టెక్నీషియన్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ అని, అతడు క్యారెక్టరైజేషన్ బాగా చేస్తాడని నాగార్జున చెప్పాడు. ‘సోగ్గాడే చిన్నినాయన’లో తనకు బంగార్రాజు క్యారెక్టర్ ఇచ్చినట్లు ఈ సినిమాలో భ్రమరాంబ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అని, అలాగే చైతన్య క్యారెక్టర్ ‘శివ’ను కూడా ఒక ఆల్‌రౌండ్ క్యారెక్టర్‌గా బాగా తీర్చిదిద్దాడని నాగార్జున ప్రశంసించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బాహుబలి' చిత్రంలో పాత్రధారుల నుదుట పెట్టిన బొట్లు వెనుక సీక్రెట్స్...