సమంతకు నాగార్జున వార్నింగ్.. అలా పిలిస్తే చంపేస్తానని హెచ్చరిక!
టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జునకు సమంత కోడలు కానుంది. నాగ్ పెద్ద కుమారుడు నాగ చైతన్యతో త్వరలో వివాహం జరుగనుంది. అలాగే, నాగ్ చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని కూడా డిజైనర్ శ్రియా భూపాల్‌ను వివాహం
టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జునకు సమంత కోడలు కానుంది. నాగ్ పెద్ద కుమారుడు నాగ చైతన్యతో త్వరలో వివాహం జరుగనుంది. అలాగే, నాగ్ చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని కూడా డిజైనర్ శ్రియా భూపాల్‌ను వివాహం చేసుకోనున్నాడు.
ఇప్పటికే రెండు కుటుంబాల్లోనూ పెళ్లిపనులను ప్రారంభించేశారు. మండువేసవి మేలో.. అఖిల్ వివాహ వేడుక ఇటలీలో జరగబోతోంది. మరి ఈ పెళ్లికి అతి తక్కువ మంది అతిథులే హాజరు కాబోతున్నారట. ఆ విషయాలను కింగ్ నాగార్జునే వెల్లడించారు. కేవలం 150 మంది సమక్షంలోనే పెళ్లి జరుగుతుందని, రిసెప్షన్ గ్రాండ్‌గా హైదరాబాద్‌లో చేస్తామని చెప్పాడు.
మరి యాభై ఏళ్లు పైబడినా ఇప్పటికీ మన్మథుడిలానే కనిపించే నాగార్జునను.. వచ్చే కోడళ్లు ఏమని పిలుస్తారు? అంటే నాగ్ చెప్పిన సమాధానం కొంచెం ఆసక్తికరంగానే ఉంది. మామయ్య అని పిలిచేందుకు వచ్చే కోడళ్లకు ఇబ్బందిగా ఉంటుందేమో అని అన్నాడు. శ్రియా భూపాల్ చిన్నప్పట్నుంచి తెలుసని, తనను ‘నాగ్ మామ’ అంటూ పిలుస్తుందని చెప్పుకొచ్చాడు.
అయితే, ఇక్కడ సమస్య అంతా సమంతతోనే అని అన్నాడు. చైతూతో పెళ్లయ్యాక ‘నన్ను ఎలా పిలుస్తావ్’ అని సామ్‌ను అడుగుతున్నానని, తనేమో నవ్వేసి ఊరుకుంటోందని చెప్పాడు. ఇపుడు ఎప్పుడూ ‘నాగ్ సార్’ అని సమంతా పిలుస్తుందని చెప్పిన నాగ్.. ఇకపై అలా పిలిస్తే చంపేస్తానని సమంతకు చెప్పినట్లు నాగ్ వివరించాడు. అయితే సమంతా మాత్రం తనను ఏమని పిలవాలో ఇంకా నిర్ణయించుకోలేదని నవ్వేశాడు.