ఆషాడమాసం వెళ్ళేదాకా ప్రేమ పావురాలు సమ్మూ-చైతూ ఆగాల్సిందేనా? ముహూర్తం అప్పుడేనా?
గత కొంత కాలంగా సమంత-నాగచైతన్యలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట అక్కడక్కడా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ... ఈ వార్తలు నిజం అని తేల్చేశారు. వీరిద్దరి ప్రేమకథకు మొదట
గత కొంత కాలంగా సమంత-నాగచైతన్యలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట అక్కడక్కడా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ... ఈ వార్తలు నిజం అని తేల్చేశారు. వీరిద్దరి ప్రేమకథకు మొదట పెద్దవాళ్ళు అభ్యంతరాలు చెప్పినా.. తరువాత సమంత చైతూలు నేర్పుగా అందరిని ఒప్పించారని టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం.
అయితే పెళ్లి మాత్రం ఇప్పట్లో ఉండేలా కనిపించడంలేదు. మంచి ముహుర్తాలు లేనందున సమంత తల్లిదండ్రులు పెళ్లిని వాయిదా వేయాలని చెబుతున్నారట. ఆషాడమాసం వెళ్లిన తర్వాత ముహుర్తం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పడంతో... దీనికి నాగచైతన్య కుటుంబ సభ్యులు ఓకే చెప్పారట. ఇదిలా ఉంటే సమంత ఇక నుంచి సినిమాలకు కాస్తంత దూరంగా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా ఉండగా సమంత వస్తున్న కొత్త సినిమా ఆఫర్లను ఒప్పుకోవడంలేదట. ఇక నుంచి సంప్రదాయబద్దమైన పాత్రల్లోనూ... అదికూడా అతి తక్కువ సినిమాల్లో మాత్రమే చేస్తానని సమంత నిర్మాతలకు చెప్పేశారట. ఇప్పుడు చేస్తున్న సినిమాల్ని త్వరగా పూర్తి చేసుకొని కొంచెం బ్రేక్ తీసుకొని పెళ్ళికి రెడీ అవ్వాలని చైతూ, సమంతలు కలసి నిర్ణయించుకున్నారట. అయితే ఆషాడమాసం వెళ్ళేదాకా ఈ ప్రేమపావురాలు ఆగాల్సిందేనా...!