Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరోమారు పెళ్లికొడుకుకానున్న హీరో నాగ చైతన్య

naga chaitanya
, మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (18:31 IST)
అక్కినేని నాగ చైతన్య మరోమారు పెళ్లి కొడుకుకానున్నారు. ఈయన రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయన టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్టు సమాచారం. ఆమెను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని గట్టిగా భావిస్తున్నారు. దీంతో ఈ యేడాది నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోనున్నారు. 
 
టాలీవుడ్ హీరోయిన్ సమంతను తొలుత పెళ్లి చేసుకున్న నాగ చైతన్య.. గత యేడాది విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన బ్యాచిలర్ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ హీరోయిన్‌తో హీరో ప్రేమలో పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా, ఈ విషయం పెళ్లి వరకు వెళ్లింది. 
 
అయితే ఇవి కేవలం రూమర్స్‌ మాత్రమేననని అక్కినేని ఫ్యామిలీ సన్నిహితంగా ఉండేవారు చెప్పుకొస్తున్నారు. నాగ చైతన్య , అఖిల్ ప్రస్తుతం తమ కెరీర్స్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టారని, కాబట్టి ఈ రూమర్స్‌ను లైట్ తీసుకోమంటున్నారు. "బంగార్రాజు" తర్వాత నాగ చైతన్య "థ్యాంక్యూ" మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక అఖిల్ ప్రస్తుతం "ఏజెంట్" మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టులో విడుదలకానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ చందమామకు పండంటి మగబిడ్డ పుట్టాడోచ్?