Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నలుగురితో సహజీవనం.. ఒకడి కోసం మెదడులో ఆపరేషన్ చేయించుకున్నా: ముమైత్ ఖాన్

అ.. అంటే అమలాపురం అనే ఐటెం సాంగ్‌తో కుర్రకారు గుండెల్ని పిండేసిన ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే అంటూ ముమైత్ వేసిన

Advertiesment
నలుగురితో సహజీవనం.. ఒకడి కోసం మెదడులో ఆపరేషన్ చేయించుకున్నా: ముమైత్ ఖాన్
, శనివారం, 25 మార్చి 2017 (10:10 IST)
అ.. అంటే అమలాపురం అనే ఐటెం సాంగ్‌తో కుర్రకారు గుండెల్ని పిండేసిన ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే అంటూ ముమైత్ వేసిన చిందులను ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోలేరు.

అయితే ప్రస్తుతం ముమైత్ ఖాన్‌కు ఆఫర్లు రావట్లేదు. దీంతో ఇటీవల విశాఖ పట్నం జిల్లా భీమిలీ మండలం చిప్పాడ గ్రామంలో సీతమ్మ తల్లి జాతరలో.. రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో డాన్సులేసిందని సమాచారం. కానీ ఐటమ్ గర్ల్‌గా తెరపై కనిపించిన ముమైత్ ఇలా రికార్డ్ డ్యాన్సుల్లో చిందులేయడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం వరకు ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ముమైత్ ఖాన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఇప్పటి వరకు తాను నలుగురితో సహజీవనం చేశానని ఓపెన్‌‍గా చెప్పేసింది. అయితే ఆ బంధాలన్నీ ముగిసిపోయాయని స్పష్టం చేసింది. తన తొలి సహజీవనం నాలుగేళ్ల పాటు కొనసాగిందని ముమైత్ వెల్లడించింది. రెండో సహజీవనం మూడున్నర ఏళ్ల పాటు కొనసాగితే... మూడో వ్యక్తితో రెండేళ్ల పాటు కలసి ఉన్నానని చెప్పింది. చివరి బంధం మాత్రం కేవలం ఏడాదిన్నరలోనే బెడిసికొట్టిందని తెలిపింది.
 
కానీ ఇకపై ఎలాంటి బంధాలు వద్దనుకుంటున్నానని.. ఉన్న డబ్బును వృధా చేసుకోదలుచుకోలేదని తెలిపింది. చాలా కేరింగ్, ఫ్రెండ్లీగా ఉంటానని.. ఒక వ్యక్తితో బంధం కోసం సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని కూడా ముమైత్ తెలిపింది. ఆ ఆపరేషన్ కోసం రూ. 27 లక్షలు ఖర్చయిందని ముమైత్ తెలిపింది.

ప్రస్తుతం తన మెదడులో 9 ఖరీదైన టైటానియం వైర్లు ఉన్నాయని... దీంతో, తనకు ఓ ఎక్స్ మెన్ అనే భావన కలుగుతోందని చెప్పింది. ఇకపై, ఎవరి కోసమో ఇలాంటి వాటిపై తన డబ్బును ఖర్చు పెట్టదలచుకోనని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి 2 ట్రయిలర్‌కి 10 కోట్ల హిట్లు: ఉప్పొంగిపోతున్న రాజమౌళి