Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి అసిస్టెంట్ డైరెక్టరా...? ఎందుకలా...?

నందమూరి బాలకృష్ణ ముద్దుల కుమారుడు నందమూరి మోక్షజ్ఞను తెరంగేట్రం చేయించాలంటూ నందమూరి ఫ్యాన్స్ హడావుడి చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తాజాగా హైదరాబాద్ ఫిలిమ్ నగర్లో మరో ప్రచారం వినబడుతోంది. అదేంటయ

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి అసిస్టెంట్ డైరెక్టరా...? ఎందుకలా...?
, సోమవారం, 2 మే 2016 (13:41 IST)
నందమూరి బాలకృష్ణ ముద్దుల కుమారుడు నందమూరి మోక్షజ్ఞను తెరంగేట్రం చేయించాలంటూ నందమూరి ఫ్యాన్స్ హడావుడి చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తాజాగా హైదరాబాద్ ఫిలిమ్ నగర్లో మరో ప్రచారం వినబడుతోంది. అదేంటయా అంటే... బాలయ్య 100వ సినిమా అయిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి మోక్షజ్ఞ అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేయనున్నట్లు.
 
 
ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ అనే సంగతి తెలిసిందే. క్రిష్ వద్ద సహాయ దర్శకుడుగా మోక్షజ్ఞ పనిచేసేందుకు ఉత్సుకత ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఐతే గతంలో బాలయ్య కూడా తన తండ్రి ఎన్టీఆర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసారు. అలాగే మోక్షజ్ఞను కూడా కొన్నాళ్లు దర్శకత్వ శాఖలో పనిచేయిస్తే వారు పడే సాధకబాధకాలు తెలుస్తాయనీ, అందువల్ల అలా చేరబోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెంచ్‌లో జూన్ 8న రిలీజ్ కానున్న బాహుబలి: ది బిగినింగ్.. నిజమేనా?