Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రెంచ్‌లో జూన్ 8న రిలీజ్ కానున్న బాహుబలి: ది బిగినింగ్.. నిజమేనా?

ఫ్రెంచ్‌లో జూన్ 8న రిలీజ్ కానున్న బాహుబలి: ది బిగినింగ్.. నిజమేనా?
, సోమవారం, 2 మే 2016 (13:05 IST)
బాహుబలితో ప్రపంచ దేశాలను టాలీవుడ్‌ వైపు కన్నెత్తి చూసేలా చేసిన రాజమౌళి జక్కన్న.. ప్రస్తుతం బాహుబలి2లో బిజీ బిజీగా ఉన్న రాజమౌళి సినిమాకు మరో క్రేజ్ లభించింది. ఇప్పటికే బాహుబలి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఈ చిత్రం పలు భాషల్లో రిలీజైంది. తాజాగా ఈ సినిమాను ఫ్రెంచ్ భాషలో భారీ క్రేజ్‌తో రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 8వ తేదీన ఫ్రాన్స్‌లో బాహుబలి రిలీజ్ కానుంది.  
 
ఫ్రెంచ్‌లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. అలాగే చైనాలో బాహుబలి విడుదలకు రంగం సిద్ధమవుతోంది. గత ఏడాది జూలై పదో తేదీన రిలీజైన బాహుబలి రూ.600 కోట్ల మార్కును తాకిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో పీకే రికార్డును బాహుబలి అధిగమించే ఛాన్సుందని సమాచారం. పీకే సినిమా పేరిట రూ.750 కోట్ల మార్క్ రికార్డు ఉంది. ఇకపోతే.. బాహుబలి 2 షూటింగ్ జూన్ నుంచి శరవేగంగా జరుగనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది (2017) సమ్మర్లో రిలీజ్ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్టులో శ్రియ సెకండ్ ప్లేస్: క్రేజ్ తగ్గలేదండోయ్!