Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

హృతిక్‌తో ముడిపెట్టి గాసిప్స్ రాశారు.. చూసి హాయిగా నవ్వుకున్నా : పూజా హెగ్డే

హీరో అల్లు అర్జున్ జోడీగా ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్‌’లో కనిపించనున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఈమెకు దక్షిణాదిలో మళ్లీ సినీ అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ఓ వెలుగు వెలిగే సమయం ఆసన్నమైంది.

Advertiesment
Mohenjodaro Actress Pooja Hegde
, ఆదివారం, 11 జూన్ 2017 (13:19 IST)
హీరో అల్లు అర్జున్ జోడీగా ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్‌’లో కనిపించనున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఈమెకు దక్షిణాదిలో మళ్లీ సినీ అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ఓ వెలుగు వెలిగే సమయం ఆసన్నమైంది. అదేసమయంలో ఆమెపై అనేక పుకార్లు కూడా వస్తున్నాయి. ఈ గాసిప్స్‌పై స్పందిస్తూ.. హాయిగా నవ్వుకుంటాను. వాటిని సీరియస్‌గా తీసుకోను. ఏ రకంగానూ అవి నన్ను ప్రభావితం చేయవు. వాటికి రెస్పాండ్‌ కాను. తమకెలా కావాలనుకుంటే అలా అనుకుంటారు జనం. ‘మొహంజో దారో’ చేసేప్పుడు హృతిక్‌తో నన్ను ముడిపెట్టి వచ్చిన గాసిప్స్‌ చూసి నవ్వుకొని వదిలేశాను. తారలపై గాసిప్స్‌ సృష్టించి ఆనందించడం కొంతమందికి అలవాటు.
 
ఇకపోతే... 'డీజే - దువ్వాడ జగన్నాథం' చిత్రంలో సిటీకి చెందిన మోడ్రన్ గాళ్‌గా చేస్తున్నా. సినిమాలో నా పాత్ర పేరు కూడా పూజనే. ఇప్పటివరకు చేసిన పాత్రలతో పోలిస్తే ఇది కొత్త పాత్ర. ఫన్ కేరక్టర్‌. ఇది చేయడాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నా. నా కేరక్టర్‌తో పాటు బన్నీతో నా సన్నివేశాలన్నీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఇంతకంటే ఇప్పుడే ఎక్కువ చెప్పేస్తే బాగోదు. ఒక్కటి మాత్రం నిజం. సీరియస్‌ మూవీ కాకుండా ఫన్, రొమాంటిక్‌ మూవీ చెయ్యాలనీ, సెట్స్‌పై జీన్స్ వేసుకొని తిరగాలనీ అనుకున్నా. ఇది సరిగ్గా అలాంటి సినిమా. ఐ లైక్‌ రొమాంటిక్‌ డ్రామాస్‌ అండ్‌ లవ్‌ స్టోరీస్‌. ‘కుచ్ కుచ్ హోతా హై’ని వంద సార్లు చూశానంటే నమ్ముతారా.
 
సినిమాల్లో చేసే పాత్రలకూ, నిజజీవితానికీ పూర్తిగా పోలికలుండవు. స్వభావాల్లో కొన్ని పోలికలుండవచ్చు కానీ, ప్రవర్తన విషయంలో కమర్షియల్‌ సినిమాల పాత్రల్లో డ్రమటైజేషన్ ఎక్కువగా ఉంటుంది. జనరల్‌గా కాలేజ్‌ స్టూడెంట్‌ ఎలా ఉంటుందో నా పాత్ర అలాగే ఉంటుంది. కాలేజీలో నేను ఇంట్రావర్ట్‌ని. ఎవరితోనూ పెద్దగా కలిసేదాన్ని కాదు. మనసులో మాట బయట పెట్టేదాన్ని కాదు. ఇందులోని కేరక్టర్‌ దానికి భిన్నంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని నిర్మాత... చివరి రోజుల్లో దాసరి పరిస్థితి... పవన్ ఒక్కడే ఆదుకుంటాడనీ?