Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాను ఎవరికి భయపడతానంటే.. ట్విటర్‌లో వెల్లడించిన మోహన్ బాబు

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు కలిగిన హీరో మోహన్ బాబు. ప్రత్యేకమైన ఇమేజ్ ఈయన సొంతం. తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే మోహన్‌బాబు క్రమశిక్షణకు, ముక్కుసూటితనానికి మారు పేరు. దీంతో చ

Advertiesment
తాను ఎవరికి భయపడతానంటే.. ట్విటర్‌లో వెల్లడించిన మోహన్ బాబు
, శుక్రవారం, 16 డిశెంబరు 2016 (11:14 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు కలిగిన హీరో మోహన్ బాబు. ప్రత్యేకమైన ఇమేజ్ ఈయన సొంతం. తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే మోహన్‌బాబు క్రమశిక్షణకు, ముక్కుసూటితనానికి మారు పేరు. దీంతో చాలా మంది ఆయనంటే భయపడతారు. బయటివారే కాదు.. తన కుమారులైన మనోజ్‌, విష్ణు, మంచు లక్ష్మీ కూడా ఇప్పటికీ తమ తండ్రి అంటే భయపడిపోతారు.
 
మరి, ఇంతమందిని భయపెట్టే మోహన్‌ బాబుకు ఎవరంటే భయపడతారో తెలుసా? ఈ ప్రపంచంలో మోహన్‌బాబును భయపెట్టే ఏకైక వ్యక్తి.. ఆయన భార్య నిర్మలా దేవి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. నిర్మలా దేవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మోహన్‌బాబు.. 'ఈ ప్రపంచంలో నేను భయపడేది నా భార్యకు మాత్రమేన'ని అసలు రహస్యాన్ని బయటపెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంపర్ ఆఫర్ : ‘లైలా ఓ లైలా’ అంటూ అందాలను ఆరబోసిన సన్నీ