Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమాయకంగా కనిపించే అవసరాల తక్కువోడేం కాదంటున్న బెంగాలీ భామ

దర్శకనటుడు అవరసరాల శ్రీనివాస్‌పై బెంగాలీ పాప మిస్తీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమాయకంగా కనిపించే అవసరాల శ్రీనివాస్ తక్కువోడేం కాదని అంటోంది. ఇటీవల విడుదలైన బాబు బాగా బిజీ చిత్రంలో ఉన్న ముగ్

Advertiesment
అమాయకంగా కనిపించే అవసరాల తక్కువోడేం కాదంటున్న బెంగాలీ భామ
, మంగళవారం, 16 మే 2017 (12:18 IST)
దర్శకనటుడు అవరసరాల శ్రీనివాస్‌పై బెంగాలీ పాప మిస్తీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమాయకంగా కనిపించే అవసరాల శ్రీనివాస్ తక్కువోడేం కాదని అంటోంది. ఇటీవల విడుదలైన బాబు బాగా బిజీ చిత్రంలో ఉన్న ముగ్గురు హీరోయిన్లలో మిస్తీ చక్రవర్తి ఒకరు.
 
ముద్దు ముద్దుగా క్యూట్‌గర్ల్‌గా కనిపించే బెంగాలీ పాప మిస్తీ చక్రవర్తి తొలిసినిమా 'చిన్నదాన నీకోసం'తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కేవలం గ్లామర్‌కే పరిమితం అయిందన్న అపవాదు మూటకట్టుకున్న మిస్తీ బాలీవుడ్‌కి వెళ్ళిపోయింది. దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్‌ తరువాత ఓ అడల్ట్‌ సినిమా బాబు బాగా బిజీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
ఈ గ్యాప్‌పై ఆమె స్పందిస్తూ... తెలుగులో నా మొదటి సినిమా తర్వాత బాలీవుడ్‌, బెంగాలీ సినిమాలు పూర్తి చేయవలసి వచ్చింది. దాంతో ఇక్కడ అవకాశాలు వచ్చినా చేయలేకపోయాను. ఇక నుంచి తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను.
 
'బాబు బాగా బిజీ' మాతృక 'హంటర్'‌లు వేర్వేరన్నారు. హంటర్ చిత్ర ప్రభావం నామీద ఉండకూడదనే చూడలేదు. కానీ తెలుగు దగ్గరకి వచ్చేసరికి చాలా మార్పులు చేశారు. ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు జరిగాయి. ఈ విషయం సినిమా చూసిన వారికి ఇట్టే తెలిసిపోతుంది.
 
తెలుగులో ఆయన సినిమాలు చూశాను. తెర మీద ఎంత అమాయకంగా కనిపిస్తారో బయట కూడా అంతే అమాయకంగా కనిపిస్తారు. మంచి మనిషి. చక్కగా మాట్లాడతారు. తాను నవ్వకుండా ఎదుటివారిని నవ్వించడంలో దిట్ట. షూటింగ్ మొత్తం బాగా ఎంజాయ్‌ చేశాం. షూటింగ్‌ ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేదని అనిపించిందని చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాఫ్ గర్ల్ ఫ్రెండ్ కోసం ఎదురుచూపు... ఆమె అతడికి అలా వుంటుందట...(video)