Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థియేటర్లు మన చేతుల్లోనే.. మనకే కేటాయించుకుందాం : ఆ ముగ్గురు బడా నిర్మాతల సంక్రాంతి సెటిల్మెంట్!

టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగకు థియేటర్ల కొరత ఏర్పడనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లన్నీ ఆ ముగ్గురు నిర్మాతల చేతుల్లోనే ఉండటంతో ఈ పరిస్థితి ఉత్పన్నంకానుంది. పైగా.. ఆ ముగ్గురు నిర్మాతలు బడా

Advertiesment
mega producer in tollywood
, సోమవారం, 9 జనవరి 2017 (10:03 IST)
టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగకు థియేటర్ల కొరత ఏర్పడనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లన్నీ ఆ ముగ్గురు నిర్మాతల చేతుల్లోనే ఉండటంతో ఈ పరిస్థితి ఉత్పన్నంకానుంది. పైగా.. ఆ ముగ్గురు నిర్మాతలు బడా ప్రొడ్యూసర్లు కావడంతో చిన్న చిత్రాలకు థియేటర్లు కేటాయించడం లేదు. దీంతో ఆర్.నారాయణ మూర్తి చిత్రానికి ఒక్క థియేటర్ కూడా కేటాయించలేదు. ఈ విషయాన్ని ఆయన మీడియా ముందే బహిర్గతం చేశారు.
 
దీనికి కారణం ఈ సంక్రాంతికి ఇద్దరు అగ్రహీలో చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి చిత్రం "ఖైదీ నంబర్ 150" కాగా, మరొకటి బాలకృష్ణ నటించిన "గౌతమిపుత్రశాతకర్ణి" చిత్రాలు. వీటితో పాటు.. శర్వానంద్ 'శతమానం భవతి', ఆర్ నారాయణ మూర్తి 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' చిత్రాలు బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధమయ్యాయి.
 
అయితే, సినిమా వసూళ్లలో నైజాం ఏరియా అత్యంత కీలకం. నైజాంలో ఎక్కువ థియేటర్స్ దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ చేతిలో ఉన్నాయి. వీరిలో సురేష్ బాబు 'గౌతమిపుత్ర శాతకర్ణి' అండగా ఉన్నారు. ఇక అల్లు అరవింద్ 'ఖైదీ నెం.150'కి దండుగా ఉన్నారు. దిల్ రాజు తన సొంత చిత్రం 'శతమానం భవతి' సినిమాని వీలైనన్ని ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
అయితే, ఈ బడా నిర్మాతలంతా కలసి ఓ సెటిల్మెంట్ చేసుకొన్నట్టు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ వీక్ టాక్ బట్టీ గుడ్ టాక్ తెచ్చుకొన్న సినిమాకి థియేటర్స్ పెంచాలని.. టాక్ బట్టి ఏ సినిమాకి నష్టం కాకుండా థియేటర్స్ అడ్జెస్ట్ చేయాలని తీర్మాణించినట్టు తెలుస్తోంది. మొత్తానికి బడా నిర్మాతల సెటిల్మెంట్ అదిరిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియాంకా చోప్రా అందాలు చూడతరమా? గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో అంగాంగ ప్రదర్శన!