Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి 'ఎంఈకే' షోలో అఖిల్ అక్కినేని... సెల్ఫీని పోస్ట్ చేసిన నాగార్జున తనయుడు

మెగాస్టార్ చిరంజీవి వెండితెరతో పాటు.. బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యాతగా "మీలో ఎవరు కోటీశ్వరుడు" అనే కార్యక్రమం ప్రసారమవుతోంది. స్టార్ మాలో వచ్చే ఈ షోకు... సెలబ్రెటీలు అతిథులుగ

Advertiesment
Meelo Evaru Koteeswarudu
, బుధవారం, 10 మే 2017 (08:59 IST)
మెగాస్టార్ చిరంజీవి వెండితెరతో పాటు.. బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యాతగా "మీలో ఎవరు కోటీశ్వరుడు" అనే కార్యక్రమం ప్రసారమవుతోంది. స్టార్ మాలో వచ్చే ఈ షోకు... సెలబ్రెటీలు అతిథులుగా వస్తున్నారు. దీంతో ఈ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. 
 
ఈ క్రమంలోభాగంగా తాజా సెలబ్రేటీల షో‌లో భాగంగా అక్కినేని అఖిల్ గెస్ట్‌గా పాల్గొన్నట్లు సమాచారం. అఖిల్ మీలో ఎవరు కోటీశ్వరుడు సెట్లో ఒక అభిమానిలా సంబరం చేసుకొని ఓ సెల్ఫీని తీసుకొని తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. 
 
అఖిల్ తన ట్విట్టర్ ఖాతాలో సెల్ఫీ ఫోటోను పెట్టి.. దానికింద కామెంట్స్ చేశారు. "నేను మాటలో చెప్పలేను ఆ క్షణం ఎలా ఫీల్ అయ్యానో. మెగాస్టార్ చూపిన ప్రేమ నన్ను మరింత ఆయనను ప్రేమించేలా చేసింది" అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూస్తూ పెరిగిన అఖిల్‌కు చిరుని చూడగానే ఒక్కసారిగా అభిమానం వెల్లువెత్తిందట. దీంతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో అభిమానిలా సంబరం చేసుకొని చిరుతో ఉన్న సెల్ఫీని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా చరణ్ అఖిల్‌లు బెస్ట్ ప్రెండ్స్ అన్న సంగతి విదితమే. 
 
మరోవైపు... తన ప్రియురాలు శ్రియా భూపాల్ రెడ్డితో వివాహం రద్దు అయిన తర్వాత ఇలా బహిరంగ కార్యక్రమంలో అఖిల్ అక్కినేని పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు.. శ్రియా భూపాల్ రెడ్డి మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్‌, అతని స్నేహితుడు శరత్‌లతో కలిసి పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 350 కోట్ల దిశగా పరుగు తీస్తున్న హిందీ బాహుబలి-2.. నిజంగా గేమ్ చేంజర్ అంటున్న తరణ్ ఆదర్స్