Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''కాటమరాయుడు''కి మరదలిగా మానస హిమవర్ష.. పవన్‌ను బాగా ఏడిపిస్తుందట..

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ''కాటమరాయుడు'' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అ

Advertiesment
Manasa Himavarsha
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (09:25 IST)
పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ''కాటమరాయుడు'' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో పవన్‌ మరదలిగా నటి మానస హిమవర్ష నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో పవన్‌ మరదలైన మానస హిమవర్ష పవన్‌ను బాగా ఏడిపిస్తుందట. ఈ చిత్రం మొత్తం కూడా తాను ఓణీలు కట్టుకునే కనిపిస్తుందట. పవన్‌ అభిమానిగా ఉండే నటి మానస ఈ చిత్రంలో పవన్‌ సరసన నటించే అవకాశం రావడంతో సంతోషంతో ఎగిరిగంతేస్తోంది.
 
రెండేళ్ల క్రితం ''రొమాన్స్'' మూవీలో నటించిన మానస హిమవర్ష.. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మరదలు అయిపోయింది. తాజాగా మీడియాతో ముచ్చటించిన మానస హిమవర్ష పవన్‌ మరదలిగా నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ చిత్రంలో తన పాత్ర కూడా చాలా బాగుంటుందని, పవన్‌ ఇంట్లోనే ఉంటూ తన సోదరిలతో కలిసి పవన్‌ను ఏడిపిస్తానని ఈ అమ్మడు అంటోంది. ఇప్పటికే కాటమరాయుడు షూటింగ్‌లో మానస హిమవర్ష జాయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె నారా రోహిత్ మూవీ 'అప్పట్లో ఒకడుండేవాడు'లో కూడా నటిస్తోంది. 
 
ఈ సినిమాలో నక్సల్ పాత్రలో ఈ మాసన హిమవర్ష కనిపించనుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో పవన్‌ సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పవన్‌ సన్నిహితుడు శరత్‌ మరార్‌ భారీగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో కూడా ఆఫర్లను సొంతం చేసుకుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా బెడ్ రూమ్, బాత్రూమ్ షేర్ చేసుకోవాలంటే.. నేహా ధూపియా