మల్లికా షెరావత్‌పై పారిస్‌లో మాస్కులేసుకున్న దుండగుల దాడి.. టియర్ గ్యాస్ స్ప్రే చేసి?
బాలీవుడ్ హాట్ గర్ల్ మల్లికా షెరావత్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పారిస్‌లోని ఆమె సొంత అపార్ట్‌మెంట్లో చోటుచేసుకుంది. గత శుక్రవారం రాత్రి 9.30 గంట
బాలీవుడ్ హాట్ గర్ల్ మల్లికా షెరావత్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పారిస్‌లోని ఆమె సొంత అపార్ట్‌మెంట్లో చోటుచేసుకుంది. గత శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మల్లిక తన ప్రియుడు సిరిల్‌తో కలిసి అపార్టు మెంట్‌కు వచ్చింది. ఆ సమయంలో మాస్కులు ధరించి అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. మల్లికా షెరావత్.. సిరిల్‌లపై టియర్ గ్యాస్ స్ప్రే చేసి ఈ దాడి చేసి పరారైనారు.
ఈ విషయాన్ని మల్లికా షెరావత్ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వ్యవహారం బయటికి వచ్చింది. మల్లిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియాన్ ఫ్లాట్ పక్కనే మల్లిక ఫ్లాట్ కూడా ఉంటుంది. గతంలో కర్దాషియన్ ఫ్లాట్‌కు వచ్చిన దుండగులు మల్లిక షెరావత్‌ను తుపాకీతో బెదిరించి డబ్బు, నగదు దోచుకెళ్లారు. అయితే ఈసారి మల్లికా షెరావత్‌పై ఎందుకు దాడి జరిగిందనేది తెలియరాలేదు.