Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలైకా అరోరా ఇంటికి అర్థరాత్రి వచ్చిన అర్జున్ కపూర్.. రాత్రంతా అక్కడే ఉన్నారట...

Advertiesment
Malaika Arora Khan And Arjun Kapoor Spotted Together Late Evening
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (13:04 IST)
బాలీవుడ్ జంటలు చెట్టాపట్టాలేసుకువని తిరగడం సహజం. ఒకప్పుడు ఇలా తిరగడాన్ని పెద్ద తప్పుగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా సర్వసాధారణమైపోయింది. ఎవరు పడితే వారు.. ఎక్కడపడితే అక్కడ ప్రేమ పక్షుల్లా పార్టీలకు పబ్బులకి తిరుగుతున్నారు. వయసుతో పనిలేకుండా వీర విహారం చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ముదురు భామ, లేత కుర్రాడు చేరిపోయారు. వాళ్లెవరో కాదు బాలీవుడ్ ఐటమ్ క్వీన్ మలైకా ఆరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్. 
 
ఈ బాలీవుడ్ భామ తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకోగా, అది కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ వీరిద్దరు వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణం మాత్రం అర్బాజ్ లైఫ్‌లో సెటిల్ అవ్వకపోవడమే అని కొందరు అంటున్నా.. మరో పక్క మలైకా సీక్రెట్ ఎఫైర్స్ వల్లనే విడిపోయారని ఇంకొందరు అంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో మలైకా ఉంటున్న అపార్ట్‌మెంట్‌కి అర్థరాత్రి కుర్రహీరో అర్జున్ కపూర్ వెళ్లాడని ఆమె ఇంట్లోనే రాత్రంతా గడిపాడని పార్టీ చేసుకున్నాడని వార్తలు వెలువడ్డాయి. ఈ విషయంపై ఇద్దరిని సంప్రదిస్తే మలైకా - అర్జున్ కపూర్‌లు అలాంటిదేమీ లేదంటూ తోసిపుచ్చేశారట. మరి వీరి వ్యవహారం ఎప్పుడు బయటపడుతుందాని బాలీవుడ్ జనాలు కళ్లలో వత్తులేసుకుని మరీ చూస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతడిని ఓ ఆట ఆడుకుంటున్న అనుష్క శర్మ... సుత్తితో బాదేసిన విరాట్ కోహ్లి(ఫోటోలు)