అనసూయ-రష్మిలతో పోటీకి సై.. బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్న మాధవీలత..
నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించిన మాధవీలత గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమాల్లో కనిపించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ అప్పట్లో మాధవీలతకు ఆఫర్లు అంతగా
నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించిన మాధవీలత గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమాల్లో కనిపించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ అప్పట్లో మాధవీలతకు ఆఫర్లు అంతగా రాలేదు. దీంతో తమిళ మూవీస్‌లో ట్రై చేసినా అక్కడా సక్సెస్ కాలేదు. అలా హీరోయిన్‌గా ఫేడవుట్ అయిన మాధవి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ బోలెడు ఫాలోవర్లను సంపాదించుకుంది.
ఇక అసలు విషయానికొస్తే.. బుల్లితెరపై హాట్ యాంకర్లుగా రాణిస్తున్న అనసూయ-రష్మిలతో పోటీ పడేందుకు మాధవి లత రెడీ అవుతుందట. ఓ ఛానల్‌లో జబర్దస్త్‌కి పోటీగా రాబోయే షోలో మాధవీలత యాంకర్‌గా చేయబోతోందట. నాగబాబు-రోజాలకు పోటీగా రమ్యకృష్ణ-పోసాని జడ్జీలుగా వ్యవహరిస్తారట. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన మాధవీలత, హీరోయిన్‌గా చేసి మళ్ళీ ఇప్పుడు బుల్లితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
జబర్దస్త్‌తో పాపులరయిన అనసూయ-రష్మిలకి సిల్వర్ స్క్రీన్ మీద కూడా క్రేజ్ వుంది. మరి తమ గ్లామర్‌తో బుల్లితెరపై దూసుకుపోతున్న అనసూయ-రష్మిలకి మాధవీలత చెక్ పెడుతుందా లేదో వేచి చూడాలి.