Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేరు కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్న నిర్మాత!

కొత్తగా వచ్చే నిర్మాతలు ఏదో సాధించాలని సినిమా రంగంలోకి అడుగుపెడతారు. తమకు తెలిసిన వారిని హీరోగానూ, దర్శకుడిగానూ పెట్టి సినిమా తీస్తారు. తాజాగా శ్రీవిష్ణుతో 'మా అబ్బాయి' సినిమా తీశాడు బలగం ప్రకాష్‌ రా

పేరు కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్న నిర్మాత!
, బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:09 IST)
కొత్తగా వచ్చే నిర్మాతలు ఏదో సాధించాలని  సినిమా రంగంలోకి అడుగుపెడతారు. తమకు తెలిసిన వారిని హీరోగానూ, దర్శకుడిగానూ పెట్టి సినిమా తీస్తారు. తాజాగా శ్రీవిష్ణుతో 'మా అబ్బాయి' సినిమా తీశాడు బలగం ప్రకాష్‌ రావు. ఇందుకోసం పబ్లిసిటీకి చాలా ఖర్చు వెచ్చించాడు. ఇటీవలే తన పుట్టినరోజు ప్రముఖ దినపత్రికలో శుభాకాంక్షలు తెలియజేయడానికి లక్షలు ఖర్చు పెట్టాడు. అదేరోజు కావాల్సిన స్పేస్‌ లేకపోయినా ఉన్నంతలో వేయండని.. ఆ డబ్బుతో చిన్నపాటి ఫొటో టాప్‌లో వచ్చేలా చేసుకున్నాడు. ఇది చూసిన పత్రికా వర్గం ఆశ్చర్యపోయినా.. తమకు రావాల్సింది తీసుకుని మిగిలింది తిరిగి ఇచ్చేయడం జరిగింది. 
 
టాలీవుడ్‌లో ఇలాంటి నిర్మాతలు ఖర్చుకు వెరవకుండా రావడం.. ఆసరగా తీసుకుని కొంతమంది మంచి కథల పేరుతో బుట్టలో వేసుకుంటారు జాగ్రత్తగా సుమా అని సన్నిహితులు హితవు పలికారు. ఈ సందర్భంగా తన సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఏదో తెలియని ఉత్సాహం, సంతోషం, ఉద్వేగంగా ఉంది. ఎక్కడో శ్రీకాకుళంలో మారుమూల గ్రామంలో పుట్టిన నేను ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో సినిమా చేయడంతో ఏదో సాధించానని అనుకుంటున్నాను. 
 
దర్శకుడు కథ చెప్పగానే సినిమా చేయగలుగుతాడా? అనిపించింది. కానీ వట్టి కుమార్‌ తాను గట్టి కుమార్‌ అని నిరూపించుకున్నాడు. హీరో శ్రీవిష్ణు చక్కగా నటించాడు. తను భవిష్యత్‌లో పెద్ద హీరోగా ఎదిగాడు. అలాగే చిత్రా శుక్లా నటనే కాదు, చక్కగా డ్యాన్స్‌ కూడా చేశాడు. థమశ్యామ్‌ మంచి విజువల్స్‌ ఇచ్చాడని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిల్ - శ్రియాభూపాల్ పెళ్లి రద్దా? పోస్ట్‌పోనా...? ఎయిర్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారా?