హైదరాబాదులో చిరంజీవి-రాయ్ లక్ష్మీలపై ఐటమ్ సాంగ్.. రూ.40లక్షలు డిమాండ్ చేసిందట
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించే ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. అభిమానుల్లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో ప్రత్యేక గీతాల్లో నటించేందుకు హీరోయ
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించే ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. అభిమానుల్లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో ప్రత్యేక గీతాల్లో నటించేందుకు హీరోయిన్లు భారీగా డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ప్రత్యేక గీతం కోసం 15 లక్షలు పారితోషికం తీసుకున్న రాయ్‌లక్ష్మీ తాజాగా చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెంబర్150 కోసం ఏకంగా రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ పాట కోసం ముందుగా కేథరిన్‌ను ఎంపిక చేశారు.
అయితే ఏమైందో ఏమో కానీ ఆమెకు పక్కన బెట్టి.. రాయ్ లక్ష్మీని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాయ్ లక్ష్మీ ఐటమ్ సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేసిందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. రాయ్‌లక్ష్మీ రూ.40లక్షలు డిమాండ్ చేసినా.. యూనిట్ ఆమెకు అంత మొత్తాన్ని మట్టుబెట్టేందుకు సిద్ధంగా ఉంది.
ఇకపోతే.. ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి, రాయ్‌లక్ష్మీలపై హైదరాబాదులోని ఓ స్టూడియోలో షూట్ చేశారు. ఈ పాట సినిమాకు హైలైట్ కానుంది.