Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళం 'కత్తి'.. తెలుగు 'ఖైదీ'.. మక్కీ టు మక్కీ దించేశారట.. ఫిల్మ్ నగర్‌లో చర్చ (ట్రైలర్ వీడియో)

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక శనివారం రాత్రి గుంటూరు వేదికగా జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడు

Advertiesment
Khaidi No 150 Official Theatrical Trailer
, ఆదివారం, 8 జనవరి 2017 (15:57 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక శనివారం రాత్రి గుంటూరు వేదికగా జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళ హీరో విజయ్, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన "కత్తి"ని చిరంజీవి హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో "ఖైదీ నంబర్ 150"గా రీమేక్ చేశారు. అయితే, సినిమా మొత్తాన్ని దించేయకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు చెప్పారు సినిమా దర్శక నిర్మాతలు.
 
కానీ, శనివారం విడుదలైన ట్రైలర్‌ను చూస్తే మాత్రం తమిళ్ ఒరిజినల్ సినిమా కత్తి ట్రైలర్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలాగే ఖైదీ నంబర్ 150 ట్రైలర్‌ ఉందనే టాక్ వినిపిస్తోంది. సినిమాలో మార్పులు చేర్పులన్నది విడుదలయ్యాక తెలుస్తుందేమో కానీ.. ట్రైలర్ విషయంలో మాత్రం మక్కీ టు మక్కీ దించేశారంటూ ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.  రీమేక్ సినిమా కాబట్టి చిత్రం మొత్తం అలాగే ఉన్నా ఏం ఫర్వాలేదు కానీ.. ట్రైలర్‌ను కూడా అలా దించేయడమేంటనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'లోఫర్' బ్యూటీ నీళ్లలో కూడా... నిన్న జాకీతో మసాజ్.. నేడు నీళ్లలో టూపీస్ బికినీలో స్మిమ్మింగ్ (Video)