బాలీవుడ్ హాటెస్ట్ జంటల్లో ఒకరు రణబీర్-కత్రినాకైఫ్. రణబీర్ కపూర్, దీపిక పదుకొనేతో బ్రేక్ అయిన తర్వాత కత్రినాకైఫ్‌తో ప్రేమాయణం నడిపాడు. అంతేకాదు కత్రినాకైఫ్ కూడా సల్మాన్ ఖాన్‌తో బ్రేకప్అయిన తరువాత రణబీర్‌తో ప్రేమాయణం ప్రారంభించింది. ఆరు ఏళ్ల బంధం, చివరకు గతేడాది బ్రేకప్ అయ్యింది. బ్రేకప్ అయ్యిన తరువాత కత్రినాతో తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ మాట్లాడడానికి అస్సలు ఇష్టపడట్లేదట. వీరిద్దరి బ్రేకప్ తరువాత అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తున్నచిత్రం 'జగ్గా జసూస్'.
ఈ సినిమాలో రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు మూడేళ్ళ క్రితం మొదలైనా ఇప్పటివరకు పూర్తి కాలేకపోయింది. ఎందుకో తెలుసా బడ్జెట్ సమస్యలతో కొంతవరకు, రణబీర్-కత్రినాకైఫ్‌ల బ్రేక్ అప్‌తో మరికొంత ఆలస్యం అవుతోందట. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే కెమెరా ముందు తప్ప అక్కడ ఖాళీ సమయాల్లో కత్రీనాతో రణబీర్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నాడట.
తన మాజీ ప్రియురాలితో అస్సలు మాట్లాడడం లేదట. అయితే, కత్రినా అయినా రణబీర్‌ను ప్రేమతో పలకరిస్తుందనుకుంటే.. ఆమె కూడా అతనినే అనుసరిస్తోందట. ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడకపోవడంతో ఏమి చేయాలో తెలీక దర్శకుడు జుట్టు పీక్కుంటున్నాడట. ఇందులో ఓ ఇంటిమేట్ సీన్ ఉందట ఆ సీన్‌ని కత్రినాకైఫ్ చేయమంటే ససేమిరా చేయనని మొండికేసిందట.
ఎన్ని రకాలుగా బ్రతిమిలాడినా ప్రయోజనం లేకపోవడంతో అచ్చూ ఆమెలా కనిపించే ఓ డూప్‌తో ఆ సీన్స్‌ని చేయించాలని దర్శకుడు డిసైడ్ అయ్యాడట. ఈ వ్యవహారం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలని దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ నోటా ఈ నోటా విషయం లీక్ అవ్వడంతో ప్రస్తుతం బాలీవుడ్ అంతా ఈ వ్యవహారాన్నే చర్చించుకుంటుంది. దాంతో ఏం చేయాలో తెలియక దర్శకుడు సతమతమవుతున్నాడట.