Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కడ 'బాహుబలి 2' కొంటే చేతికి చిప్ప మిగులుతుందట... పారిపోతున్న డిస్ట్రిబ్యూటర్స్...

బాహుబలి కంక్లూజన్ గురించి వేరే చెప్పాల్సిన పనేముంది. ఈ చిత్రం రికార్డులు తిరగరాయడం మామూలే. రూ. 1000 కోట్ల వసూళ్లను లాగుతుందని అంటున్నారు. కొందరైతే... అదేంటి, వెయ్యి కోట్లేనా...? లాగించి కొడితే రూ. 150

Advertiesment
అక్కడ 'బాహుబలి 2' కొంటే చేతికి చిప్ప మిగులుతుందట... పారిపోతున్న డిస్ట్రిబ్యూటర్స్...
, సోమవారం, 27 మార్చి 2017 (17:19 IST)
బాహుబలి కంక్లూజన్ గురించి వేరే చెప్పాల్సిన పనేముంది. ఈ చిత్రం రికార్డులు తిరగరాయడం మామూలే. రూ. 1000 కోట్ల వసూళ్లను లాగుతుందని అంటున్నారు. కొందరైతే... అదేంటి, వెయ్యి కోట్లేనా...? లాగించి కొడితే రూ. 1500 కోట్ల దాకా వెళుతుంది. బాహుబలి బిగినింగ్ మించి బాహుబలి ఎండింగ్ లాగించేస్తుందంటూ ఆదివారం నాడు రామోజీ ఫిలిమ్ సిటీలో జరిగిన ప్రి-రిలీజ్ వేడుకల్లో చెప్పేసారు. కాగా ఇంతకుముందే దాదాపు రూ. 100 కోట్ల మేర ఆయా ప్రాంతాల్లో బాహుబలి 2 చిత్రం హక్కుల్ని సొంతం చేసుకున్నారు చాలామంది.
 
ఐతే దేశంలో ఒకే ఒక్కచోట మాత్రం బాహుబలి 2ని కొంటే తమకు చిప్ప మిగులుతుందని భయపడుతున్నారట. అదేంటి... బాహుబలి చిత్రాన్ని కళ్లు మూసుకుని కొనేయవచ్చు కదా అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు. కానీ కర్నాటకలో మాత్రం అలా అనుకోవడం లేదట. ఎందుకంటే కర్నాటక ప్రభుత్వం ఇటీవలే సినిమా టిక్కెట్ల ధరలు దారుణంగా తగ్గించేయడంతో, సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వస్తున్నాయట. దానితో సినిమాలు విడుదల చేసే నిర్మాతలకు అసలు రాబట్టేందుకే నానా తంటాలు పడుతున్నారట. 
 
ఈ నేపధ్యంలో బాహుబలి 2 చిత్రాన్ని ఫ్యాన్సీ రేట్లకు కొంటే కొంప మునుగుతుందని వారు భయపడుతున్నారట. బాహుబలి చిత్రం అంటే పారిపోయే పరిస్థితి వున్నదట. మరి అవన్నీ పక్కనపెట్టేసి కర్నాటకలో ఎవరైనా చిత్రాన్ని ధైర్యం చేసి కొంటారేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీముఖి పొట్టి-వరుణ్ తేజ్ హైట్.. ఐటమ్ ఛాన్స్ మిస్.. మిస్టర్ సరసన బాహుబలి గర్ల్..?!