నా టాలెంట్‌ని అమ్ముకోవడానికే వచ్చా.. శరీరాన్ని కాదు.. కరీనా కపూర్
ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన నటుడికి అసలైన ప్రొఫిషనలిజం ఎక్కడ కనపడుతుంది. అంటే కరీనా కపూర్ అందుకు ఉదహరణగా మారింది. కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్ళి చేసుకున్న తర్వాత వివాహ జీవ
ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన నటుడికి అసలైన ప్రొఫిషనలిజం ఎక్కడ కనపడుతుంది. అంటే కరీనా కపూర్ అందుకు ఉదహరణగా మారింది. కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్ళి చేసుకున్న తర్వాత వివాహ జీవితాన్ని అనుభవిస్తూ మరోపక్క వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. నిజానికి కొందరు హీరోయిన్లు నచ్చని సినిమాలు చేయడానికి కథ నచ్చలేదని.. డేట్లు కుదరలేదని ఏవేవో సాకులు చెబుతూ వెనకాడతారు. కొంతమంది తమకు వీలుకాక నో చెప్పేందుకు ఇబ్బంది పడతారు.
కానీ కరీనాకపూర్ మాత్రం ఏ విషయమైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. అయితే తను అలా చెప్పడానికి గల కారణాన్ని ఇటీవల మీడియాతో చెప్పుకొచ్చింది. ''నా టాలెంట్‌ని అమ్ముకోవడానికి ఇక్కడికి వచ్చా. అంతే తప్ప అభిమానులకు ఏది నచ్చితే అది చేయాలని.. వాళ్లను స్నేహితులుగా మార్చుకోవాలని కాదు. నా గురించి పూర్తిగా తెలిసినవాళ్లు.. నామీద నమ్మకం ఉన్నవాళ్లు చాలామంది నాతో సినిమాలు చేయాలనుకుంటారు. అందుకే అలాంటి కొంతమంది దర్శకులతోనే తరుచుగా సినిమాలు చేస్తుంటా. ఇక ఏదైనా ప్రాజెక్టుకు నో చెప్పానంటే.. ఆ పాత్రకు నేను సెట్ అవ్వనని అనిపిస్తేనే వదులుకుంటా. అలాగే ఓ సినిమాను వదులుకోవడానికి ఎవరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు"అని తనదైన శైలిలో చెబుతోంది కరీనా కపూర్.