Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యే దిల్ హై ముష్కిల్ చిత్రంలో హాట్ సన్నివేశాలకు కత్తెర వేయలేదు : కరణ్ జొహార్

ఐశ్వర్యరాయ్, అనుష్క శ‌ర్మ, ర‌ణ‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ యే దిల్ హై ముష్కిల్. క‌ర‌న్ జోహార్ డైర‌క్ట్ చేస్తున్న ఈ సినిమాలో పాకిస్థాన్ సూప‌ర్ స్టార్ ఫ‌హ‌ద్ ఖాన్ ఓ ముఖ్

Advertiesment
యే దిల్ హై ముష్కిల్ చిత్రంలో హాట్ సన్నివేశాలకు కత్తెర వేయలేదు : కరణ్ జొహార్
, సోమవారం, 24 అక్టోబరు 2016 (12:04 IST)
ఐశ్వర్యరాయ్, అనుష్క శ‌ర్మ, ర‌ణ‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ యే దిల్ హై ముష్కిల్. క‌ర‌న్ జోహార్ డైర‌క్ట్ చేస్తున్న ఈ సినిమాలో పాకిస్థాన్ సూప‌ర్ స్టార్ ఫ‌హ‌ద్ ఖాన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ట్ర‌యాంగిల్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రేమికుల భావోద్వేగాలు ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసే అంశాలు అన్ని ఉన్నాయని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌‌ని విడుదల చేశారు. 
 
ఇందులో కామెడీ సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సీన్స్‌ని ఆడియన్స్ టేస్ట్‌‌కి తగ్గట్టు చూపించాడు కరణ్ జోహార్. ప్రేమ, ఫ్రెండ్షిప్, హార్ట్ బ్రేక్ ఈ మూడు అంశాలతో సినిమా తెరకెక్కగా ప్రతి సన్నివేశం సినీ లవర్స్‌ని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. అక్టోబర్ 28న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ చూసి అందరూ ఇందులో ఐష్‌, రణ్‌బీర్‌ మధ్య ముద్దు సన్నివేశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. 
 
కానీ సినిమాలో స్కిన్‌షో కానీ ముద్దు సన్నివేశాలు కానీ లేవని దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్ వెల్లడించాడు‌. ఎన్నో అవాంతరాలు దాటుకుని శుక్రవారం విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై కరణ్‌ జోహార్‌ ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సినిమా మొత్తంలో ఐశ్వర్య తన పాత్రకు కేవలం కళ్లు, తన వైఖరితో ప్రాణం పోసిందని ఓ నటిగా పాత్రకు ఏం కావాలో ఐష్‌కి తెలుసని అన్నాడు. కాగా సెన్సార్‌బోర్డు సినిమాలో మూడు లిప్‌లాక్‌ సన్నివేశాలను కట్‌ చేసి సర్టిఫికేట్‌ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయని కానీ అసలు సినిమాలో అలాంటి సన్నివేశాలే లేవని స్పష్టం చేశాడు కరణ్‌ జోహార్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలిసారి శింబు సరసన తమన్నా... కోలీవుడ్‌లో దశ తిరుగుతుందా?