పిల్లి శూన్యం... చేతబడులతో కాదు... కళ్లతోనే అతడిని పడేశా... కంగనా రనౌత్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నోరు తెరిచిందంటే మామూలుగా ఉండదు. తనపై ఎవరైనా అవాకులు చెవాకులు పేలితే కడిగిపారేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ నటుడుగా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్‌ను సైతం 'సిల్లీ ఎక్స్' అంటూ ఎడాపెడా కామెంట్లు కొట్టి రిటార్డ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నోరు తెరిచిందంటే మామూలుగా ఉండదు. తనపై ఎవరైనా అవాకులు చెవాకులు పేలితే కడిగిపారేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ నటుడుగా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్‌ను సైతం 'సిల్లీ ఎక్స్' అంటూ ఎడాపెడా కామెంట్లు కొట్టి రిటార్డ్ ఇచ్చిన కంగనా రనౌత్ పైన మాజీ ప్రియుడు అధ్యయన్ సుమన్ ఫైర్ అయ్యాడు. కంగానా తనపై చేతబడి చేయించి తన కెరీర్ నాశనం చేయించిందంటూ మండిపడ్డాడు.
ఆమె చేతబడులు కారణంగానే తను ఎందుకూ పనికిరాకుండా పోయానంటూ మీడియా ముందు వాపోయాడు. దీనిపై కంగనా రనౌత్ మొన్నటివరకూ ఏమీ మాట్లాడలేదు కానీ.. చివరికి తను మాట్లాడింది. తను వచ్చింది కొండ ప్రాంతం నుంచి అయినప్పటికీ చేతబడులు, పిల్లిశూన్యం(ఇది కూడా చేతబడి అని పిలుస్తారు) వంటివి చేయడం తనకు తెలియదని చెప్పుకొచ్చింది. ఐతే తను చేతబడి, పిల్లిశూన్యంతో కాకుండా మరో రకంగా మగాళ్లను ఆకర్షిస్తానని పబ్లిక్ గా చెప్పేసింది. ఎలాగేంటి అని అడిగితే... తన కళ్లతో పడేస్తానంటూ హొయలు పోతూ చెప్పింది. కాబట్టి కంగనా కళ్ల వైపు ఎవరైనా చూస్తే ఇక అంతేనన్నమాట.