Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఇజం'తో చేతులు కాల్చుకున్న కళ్యాణ్ రామ్... బోరుమంటున్న బయ్యర్లు... రూ.10 కోట్లు నష్టం?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన చిత్రం 'ఇజం'. ఈ చిత్రం ఇటీవలే విడుదలై నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో హీరో కళ్యాణ్ రామ్ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నట్టు ఫ

Advertiesment
'ఇజం'తో చేతులు కాల్చుకున్న కళ్యాణ్ రామ్... బోరుమంటున్న బయ్యర్లు... రూ.10 కోట్లు నష్టం?
, శనివారం, 5 నవంబరు 2016 (14:04 IST)
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన చిత్రం 'ఇజం'. ఈ చిత్రం ఇటీవలే విడుదలై నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో హీరో కళ్యాణ్ రామ్ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నట్టు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
నిజానికి కల్యాణ్‌ రామ్‌కు బ్యాడ్‌టైమ్‌ నడుస్తుందనే చెప్పాలి. 'పటాస్' హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన కల్యాణ్‌ రామ్‌ ఆ తర్వాత ఆర్థికంగా నష్టపోయాడు. 'పటాస్' తర్వాత ఆయన నటించిన 'షేర్' పరాజయం పాలైంది. ఈ చిత్రం లోబడ్జెట్‌ సినిమా కావడంతో ఆయన ఇబ్బంది పడలేదు. కానీ రవితేజ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా నిర్మించిన చిత్రం 'కిక్‌-2'. ఈ చిత్రం తీవ్రమైన నష్టాలను మిగిల్చింది. 
 
'ఇజం' సినిమా బడ్జెట్‌ దాదాపు రూ.26 కోట్లు. ఇంత భారీ బడ్జెట్ చిత్రం తీయడానికి హీరో సాహసం చేయలేదు. కానీ, పూరీ బలవంతపెట్టడంతో ఇంత బడ్జెట్‌తో చిత్రాన్ని పూర్తి చేయాల్సి వచ్చిందట. అదేసమయంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సైతం కల్యాణ్‌ రామ్‌ నానా తిప్పలు పడ్డారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సోదరుడు హీరో జూనియర్ ఎన్టీఆర్.. అన్నను ఆదుకునేందుకు తన బయ్యర్ల చేత ఇజంను కొనిపించాడు. తీరా చిత్రం పరాజయం పాలైంది. కేవలం ఈ సినిమాకే కల్యాణ్‌రామ్‌ దాదాపు రూ.10 కోట్ల వరకు నష్టపోయాడట. బయ్యర్లకు కూడా నష్టాలే ఎదురయ్యాయి. దీంతో ఇటు హీరోతో పాటు.. అటు బయ్యర్లు కూడా బోరుమంటున్నారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయనకంత సీన్ లేదు.. మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు : శ్రద్ధా కపూర్