Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'కబాలి'.. తొలి రోజు 4 వేల థియేటర్లలో... టిక్కెట్ ధర రూ.1000

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం కబాలి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈనెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి రోజున ఏకంగా నాలుగు వేల థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది.

'కబాలి'.. తొలి రోజు 4 వేల థియేటర్లలో... టిక్కెట్ ధర రూ.1000
, బుధవారం, 20 జులై 2016 (15:47 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం కబాలి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈనెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి రోజున ఏకంగా నాలుగు వేల థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. ఈ సినిమా చూసేందుకు రజనీ అభిమానులు, ప్రేక్షకులు అమితాసక్తి చూపుతున్నారు.
 
అదేసమయంలో టిక్కెట్ ధరలు కూడా ఒక్కసారిగా భారీగా పెంచేశారు. థియేటర్ కౌంటర్లలోనే ఏకంగా ఒక్కో టిక్కెట్ ధర రూ.600 నుంచి రూ.1000 పలుకుతోంది. ఇక బ్లాక్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా టికెట్లను అసలు ధర కంటే పదింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ఇది రజనీ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
 
మరోవైపు.. తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఈ చిత్రం తొలి వారం రోజులకు టిక్కెట్లన్నీ అమ్ముడు పోయినట్టు ట్రేడ్ వర్గాల విశ్లేషణ. ఒక్కో టికెట్ను సగటున 600 రూపాయలకు అమ్మారని ప్రేక్షకులు చెబున్నారు. తమిళనాడులో సినిమా టికెట్లను 120 రూపాయలకు అమ్మాల్సిఉండగా, దీనికి ఐదురెట్లు అధిక ధరకు అమ్మినట్టు సమాచారం. 
 
దీనికి కారణం లేకపోలేదు. చిత్ర పంపిణీదారులు ప్రదర్శన హక్కులను భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నాయి. దీంతో అసలు ధరకు టికెట్లను అమ్మితే పెట్టుబడి రావడం అసాధ్యమన్న చెబుతున్నారు. దీంతో ఓపెనింగ్ వీకెండ్లోనే సాధ్యమైనంతవరకు కలెక్షన్లు రాబట్టుకోవాలన్న ఆశతో... టిక్కెట్ల ధరను ఆమాంతం పెంచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను ఆంటీని కాదమ్మా.. అక్కా అని పిలువు : కత్రినా కైఫ్‌కు ఊహించని షాక్!