Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త, ఆ సంస్థ ఎన్టీఆర్‌తో భారీ ప్లాన్...?

Advertiesment
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త, ఆ సంస్థ ఎన్టీఆర్‌తో భారీ ప్లాన్...?
, మంగళవారం, 22 జూన్ 2021 (16:12 IST)
రెండు తరాలకు వారధిగా నిలిచింది వైజయంతి సంస్థ. మరో జనరేషన్ కోసం కొత్త కొత్త హంగుల్ని సిద్ధం చేస్తోంది. మారిన ట్రెండ్‌కి తగ్గట్లు తాను కూడా మారుతూ మేకింగ్‌లో సరికొత్త పంథాలో దూసుకెళుతున్నారు లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వనీదత్. 
 
ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ టాక్ పరిశ్రమలో వెరీ ఇంటస్టింగ్. సీనియర్ ఎన్టీఆర్‌తో పెనవేసుకున్న బంధాన్ని జూనియర్ ఎన్టీఆర్‌తో గట్టి పరుచుకోవాలన్నది వైజయంతి మూవీస్ సంకల్పంగా కనిపిస్తోంది. 
 
తారక్ హీరోగా కంత్రీ, శక్తి సినిమాలు తీసినా గెస్ చేసినంత బిగ్ హిట్ రాబట్టుకోలేకపోయింది క్రేజీ కాంబినేషన్. అందుకే ఈ సారి హ్యాట్రిక్ కోసం సాలిడ్ ఎఫర్ట్ పెడుతున్నారట. మహానటి మూవీలో తాతగారి పాత్రలో నటించాల్సిన ఈ మనవడు అప్పట్లో మిస్ అయ్యాడు.
 
కానీ మరో విధంగా ఎన్టీఆర్‌ను తమ బ్యానర్లో నటింపజేస్తోందట వైజయంతి సంస్ధ. మూడేళ్ళ నుంచి అనుకుంటున్నట్లే ఎన్టీఆర్ కాంబినేషన్ త్వరలో ఫైనల్ కాబోతోందట. ఈమూవీతో ప్రొడ్యూసర్‌గా కొత్త జనరేషన్లో కొత్తగా కనెక్ట్ కాబోతున్నారట అశ్వనీదత్.
 
సపోర్టింగ్ బ్యానర్ స్వప్న సినిమాలతో కూతుర్ల పార్టిసిపేషన్ కూడా జరగడంతో అశ్వనీదత్‌కి కొత్త బలం వచ్చినట్లయ్యిందట. అటు నాగఅశ్విన్ ఇచ్చిన ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాలు సంస్థ పటిష్టతను పెంచేశాయి.
 
అటు నందినిరెడ్డి డైరెక్షన్లో ఒక సినిమా డిస్కషన్ స్టేజ్‌లో ఉందట. దుల్కర్ సల్మాన్ హీరోగా రాఘవపూడి డైరెక్షన్లో ఒక మల్టీలెవల్ మూవీ పోగ్రెస్‌లో ఉందట. అశ్వనీదత్ గోల్డ్ మూవీగా చెప్పుకునే జగదేక వీరుడు - అతిలోక సుందరి సీక్వెల్ ఉండనే ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్స్‌పోజింగ్ నా ఇష్టం- అడిగితే ఫైర్ అయిన అన‌సూయ‌