Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నేను ఎవర్నీ'... బాహుబలి ప్రశ్న :: 'నువ్వు... రూ.100 నోట్లు ఉన్న అదృష్టవంతుడివి బాబూ'.. కట్టప్ప ఆన్సర్

దేశంలో పెద్ద నోట్ల రద్దుపై సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో చర్చతో పాటు సెటైర్లు కూడా పేలుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల వద్ద సాధారణ ప్రజానీకంతో పాటు తాము కూడా పడుతున్న కష్టాలను నెటిజన్లు ఏకరవు పెడుతున్నా

Advertiesment
Large Currency Notes Scrapping
, బుధవారం, 16 నవంబరు 2016 (13:57 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దుపై సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో చర్చతో పాటు సెటైర్లు కూడా పేలుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల వద్ద సాధారణ ప్రజానీకంతో పాటు తాము కూడా పడుతున్న కష్టాలను నెటిజన్లు ఏకరవు పెడుతున్నారు. అదేసమయంలో పెద్ద నోట్ల రద్దుతో పాటు.. దేశ వ్యాప్తంగా నెలకొన్న చిల్లర కొరతపై కూడా తమదైనశైలిలో ట్విట్టర్, వాట్సాప్‌లలో సెటైర్లు వేస్తున్నారు. ఆ సెటైర్లలో కొన్నింటిని పరిశీలిస్తే.. 
 
ప్రభాస్ "బాహుబలి" చిత్రంలోని ఓ డైలాగ్‌కు పేరడీ... 
"నేను ఎప్పుడూ చూడని కళ్లు, నన్ను ఆశగా చూస్తున్నాయి, నేను ఎవర్ని? బాహుబలి ప్రశ్న’’. 
‘‘నువ్వు... వందరూపాయల నోట్లు కలిగున్న అదృష్టవంతుడివి బాబూ..! కట్టప్ప సమాధానం’’. వాట్సాప్‌లో విహరిస్తున్న పోస్టు!
 
పవన్ కళ్యాణ్ "అత్తారింటికి దారేది" చిత్రంలోని డైలాగ్‌కు పేరడీ...
‘‘రెండు వేల నోటు ఎక్కడ తీసుకోవాలో కాదు, ఎక్కడ మార్చుకోవాలో తెలిసినోడు గొప్పోడు..!’’
‘‘బాగా ఉండటం అంటే వంద వెయ్యినోట్లు ఉండటం కాదత్తా, పది వంద నోట్లు ఉండటం.’’  
 
‘‘అవినీతి నోట్లకట్టలో లేదు! వ్యవస్థలో ఉంది. అవినీతికర వ్యవస్థను కాపాడుతూ, నోట్లను మార్చినంత మాత్రాన ఒరిగేదేంటి?’’ శ్రీనివాస్‌ అనే ఇంజనీరింగ్‌ విద్యార్థి సోషల్‌ మీడియా ద్వారా సంధించిన ప్రశ్న!
 
‘‘నల్లధనం నిరోధించడానికి ఏ చర్యైనా చేపట్టవచ్చు? అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా! ప్రజలంటే గౌరవం, బాధ్యత ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది!’’ విశ్రాంత ఉద్యోగి వెంకట కృష్ణ అభిప్రాయం!
 
వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ‘‘ఫిడేలు వాయిస్తున్న ప్రధాని ఫొటో’’....‘‘ధనికులకే నిద్రలేదంటున్న మోడీ! సాక్షంగా సామాన్యుల క్యూలు’’,
‘‘ఇప్పటివరకూ క్యూలో నిల్చుని మరణించినవారి సంఖ్య 11’’ వంటి పోస్టులన్నీ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మల్లన్న' డైరక్టర్‌తో అమలాపాల్.. కెరీర్‌పై దృష్టి.. టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టు..?