Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శిఖర్ పహరియాతో లిప్ కిస్‌లు.. జాన్వీపై శ్రీదేవి సీరియస్.. బాయ్‌ఫ్రెండ్స్‌ పెట్టుకుంటే తాటతీస్తా!

టాలీవుడ్, కోలీవుడ్‌ను శాసించిన అతిలోక సుందరి శ్రీదేవి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించేసింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి, బోనీకపూర్ ముద్దుల కుమార్తె జాన్వీ సినీ అరంగేట్రంకు రంగం సిద్దమవుతోంది. బా

శిఖర్ పహరియాతో లిప్ కిస్‌లు.. జాన్వీపై శ్రీదేవి సీరియస్.. బాయ్‌ఫ్రెండ్స్‌ పెట్టుకుంటే తాటతీస్తా!
, శుక్రవారం, 11 నవంబరు 2016 (10:37 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌ను శాసించిన అతిలోక సుందరి శ్రీదేవి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించేసింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి, బోనీకపూర్ ముద్దుల కుమార్తె జాన్వీ సినీ అరంగేట్రంకు రంగం సిద్దమవుతోంది. బాలీవుడ్‌లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ, తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియాతో చేసిన లిప్ కిస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో శ్రీదేవికి కోపమొచ్చింది. 
 
శిఖర్‌తో జాన్వీ డేటింగ్‌పై మీడియాలో వార్తలొస్తుండటంతో శ్రీదేవి జాన్విని హెచ్చరించినట్లు ముంబై మిర్రర్ పత్రిక కథనం వెల్లడించింది. బాయ్ ఫ్రెండ్స్, డేటింగ్ వంటివే కాదు, కనీసం, యువకులతో స్నేహం చేసినా తాను ఒప్పుకోనని జాన్వీకి శ్రీదేవి గట్టిగా చెప్పిందని ఆ పత్రిక తెలిపింది. 
 
కాగా, ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడే శిఖర్ పహరియాతో జాన్వి లిప్ కిస్‌లు ఇచ్చినట్లు గల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. శిఖర్‌తో తన కూతురు డేటింగ్‌ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదట. 
 
జాన్వి, శిఖర్‌ ముద్దుపెట్టుకున్న ఫొటోలపై శ్రీదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందట. అంతటితో ఆగకుండా... కూతురికి కొన్ని కఠినమైన ఆంక్షలు విధించిందని ముంబై మిర్రర్‌ పత్రిక ఓ కథనంలో తెలిపింది. ఒక్కప్పటి అందాల కథానాయికగా రాణించిన శ్రీదేవి సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో ప్రతిదానికి తల్లి సలహా ఆధారంగా నడుచుకుంది. ఇప్పుడు తన కూతురి విషయంలోనూ అదే సంప్రదాయం కొనసాగాలని ఆమె భావిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాపం.. శ్రుతిహాసన్‌-అక్షరకు ఏమీ తెలియదు.. బ్రేకప్‌కు కారణం వారు కాదు: గౌతమి