Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాపం.. శ్రుతిహాసన్‌-అక్షరకు ఏమీ తెలియదు.. బ్రేకప్‌కు కారణం వారు కాదు: గౌతమి

13 ఏళ్ల సహజీవనం తర్వాత సినీ లెజెండ్ కమల్ హాసన్‌తో గౌతమి బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. కమలహాసన్, గౌతమిలు విడిపోవడానికి నటి శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లే కారణమని.. గౌతమి వారి తండ్రితో సహజీవనం చేయడం వారికి

పాపం.. శ్రుతిహాసన్‌-అక్షరకు ఏమీ తెలియదు.. బ్రేకప్‌కు కారణం వారు కాదు: గౌతమి
, శుక్రవారం, 11 నవంబరు 2016 (10:25 IST)
13 ఏళ్ల సహజీవనం తర్వాత సినీ లెజెండ్ కమల్ హాసన్‌తో గౌతమి బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. కమలహాసన్, గౌతమిలు విడిపోవడానికి నటి శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లే కారణమని.. గౌతమి వారి తండ్రితో సహజీవనం చేయడం వారికి ఇష్టం లేదనే ప్రచారం హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి ప్రచారం గౌతమి చెవికి తాకిందేమో కానీ ఇటీవల ఓ భేటీలో కమల్‌తో బ్రేకప్ అయ్యేందుకు ఆయన కుమార్తెలు శ్రుతీహసన్, అక్షరహాసన్‌లు కారణం కాదనీ గౌతమి క్లారిటీ ఇచ్చారు. 
 
తాను సమాజంలో ఒక సెలబ్రిటిగా జీవిస్తున్నాననీ.. అందువల్ల తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని బహిరంగ పరచాల్సిన బాధ్యత తనపై ఉంటుందని వెల్లడించారు. ఇంకా చెప్పాలంటే..? తన 16 ఏట నుంచే నటిగా రంగప్రవేశం చేశాననీ, సొంత ఆలోచనలు, స్వయం కృషితోనే తానీ స్థాయికి చేరుకున్నాననీ పేర్కొన్నారు. జీవితంలో మార్పు అవసరం అని.. అయితే అలాంటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందన్నారు. తన కుమార్తె భవిష్యత్ తనకు చాలా ముఖ్యమని.. కమల్ హాసన్‌కు దూరం కావడానికి కూడా అదే కారణమన్నారు. 
 
కాగా నటి శ్రుతీహాసన్ కూడా ఇటీవల తన తండ్రి కమలహాసన్,గౌతమిలు విడిపోవడానికి తాను కారణం కాదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా కమల్-గౌతమి బ్రేకప్‌కు రమ్య కృష్ణ కారణమని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. రమ్యకృష్ణకు కమల్ ప్రతీసారి సపోర్ట్ చేయడంతో పాటు గౌతమిని అవమానించడంతోనే ఆమె కమల్‌కు దూరమైందని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ హీరో ఇంట్లో రూ.500, రూ.1000 నోట్ల కట్టలు... ఎవరా హీరో?