Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ హీరో ఇంట్లో రూ.500, రూ.1000 నోట్ల కట్టలు... ఎవరా హీరో?

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరో ఇంట్లో నల్లధనం కట్టలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ హీరో ఇంట్లో రూ.500, రూ.1000 నోట్ల కట్టల రూపంలో రూ.25 కోట్ల మేరకు ఉన్నట్టు సమాచారం. ప్

టాలీవుడ్ హీరో ఇంట్లో రూ.500, రూ.1000 నోట్ల కట్టలు... ఎవరా హీరో?
, శుక్రవారం, 11 నవంబరు 2016 (10:21 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరో ఇంట్లో నల్లధనం కట్టలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ హీరో ఇంట్లో రూ.500, రూ.1000 నోట్ల కట్టల రూపంలో రూ.25 కోట్ల మేరకు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వీటిని ఏం చేయాలో తోచక ఆ హీరో మల్లగుల్లాలు పడుతున్నట్టు వినికిడి. 
 
పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయోగించిన అస్త్రం అనేక మంది నల్లధన కుబేరుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ అస్త్రంతో ఇప్పటికే కర్నాటక రాష్ట్రంలోని బంగారుపేట ఎమ్మెల్యే ఒకరు తన ఇంట్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తీసి, నియోజకవర్గ ప్రజలకు రూ.3 లక్షలు చొప్పున పంపిణీ చేశాడు. 
 
ఇపుడు టాలీవుడ్ హీరో ఇంట్లో ఏకంగా రూ.25 కోట్ల నోట్ల కట్టలు ఉన్నట్టు సమాచారం. సినిమా రంగంతో తరతరాలుగా అనుబంధం ఉన్న స్టార్ హీరోకి.. బయట కూడా పలు రంగాల్లో పెట్టుబడులు, వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. ఓ బిజినెస్ డీలింగ్‌లో భాగంగా ఇంట్లో రూ.25 కోట్ల 1000 రూపాయల నోట్ల కట్టలను ఉంచాడట.
 
మరో రెండు రోజులు ఆగితే.. ఆ బిజినెస్ డీలింగ్ పూర్తయిపోయేదే. ఇంతలో ప్రధాని మోడీ ప్రయోగించిన రద్దు అస్త్రం ఆ హీరోను నిలువునా ముంచిందట. ఇపుడు తన ఇంట్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకు అవి బ్లాక్‌మని కావడంతో ఇప్పుడు ఆ హీరోకి ఏం చేయాలో తోచని పరిస్థితి అయింది. ఆ వెంటనే తనకు తెలిసిన ఆడిటర్లందరిని లైన్లోకి తెచ్చి.. ఆ డబ్బుని ఎలా వైట్‌మనిగా మార్చాలనే ఆలోచన చేస్తున్నాడట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి సోదరుడు కంచి దర్శకత్వంలో నటించనున్న బిచ్చగాడు..