Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను అలా చూస్తున్నారంటే నమ్మలేకపోతున్నా (Video)

Advertiesment
నన్ను అలా చూస్తున్నారంటే నమ్మలేకపోతున్నా (Video)
, మంగళవారం, 10 డిశెంబరు 2019 (22:17 IST)
మూడు దశాబ్దాల క్రితం శ్రీదేవి సినిమా విడుదల అవుతోందంటే అభిమానుల సంతోషం అంబరాన్నంటేది. అతిలోక సుందరి, తమ అభిమాన హీరోయిన్‌ను తెరమీద చూసి మురిసిపోవాలనుకునే ప్రేక్షకుల సంఖ్య కోట్లలో ఉండేది. అంతమంది అభిమానాన్ని చూరొగన్న శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ మీద కూడా ప్రస్తుతం అలాంటి అంచనాలే ఉన్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. తొలి సినిమాతోనే వెండితెరను దడదడలాడిచేసింది జాహ్నవి.  తల్లికి తగ్గ తనయగా అందరిచేతా మన్ననలు అందుకుంటోంది. 
 
అయితే తాను చిన్నప్పుడు సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదంటోంది జాహ్నవి. అమ్మకి కూడా అలాంటి ఆలోచనలు ఉండేవి కాదంటోంది. ఎంతసేపూ మమ్మల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేసి మంచి వ్యక్తితో పెళ్ళి చేయాలని అనుకునేది మా అమ్మ. నాకైతే ఒక దశలో చరిత్ర మీద బాగా ఆసక్తి కలిగింది. మంచి రచనలు చేసి రచయిత్రిని కావాలనుకున్నాను. పైకి ఎన్ని అనుకున్నా నా మనస్సు మాత్రం నేను నటిని అని ఫిక్సైపోయింది. దాంతో నటనవైపు దృష్టి పెట్టానంటోంది జాహ్నవి. 
 
అయితే ఇప్పుడు కెమెరా ముందు నటించేటప్పుడు నన్ను అందరూ హీరోయిన్‌గా చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతున్నాను. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఆమె శ్రీదేవి కుమార్తె అంటూ షూటింగ్‌లో చెవులు కొరుక్కుంటున్నప్పుడు నేను గమనిస్తూనే ఉన్నాను. మా అమ్మను నేను మిస్సయ్యానంటోంది జాహ్నవి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సజ్జనార్ కాళ్లు కడిగి ఆ నీళ్లను తాగుతానంటున్న శ్రీరెడ్డి (video)