Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ పంబ రేపుతున్న పటేల్ సర్... రెమ్యునరేషన్ 2 కోట్లట...?(వీడియో)

ఈమధ్య కాలంలో హీరోల కన్నా విలన్లకే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి నిర్మాతలకు ఎదురవుతోంది. గతంలో హీరోలుగా పనిచేసి విలన్లయిన వారు ఎక్కువ డబ్బులిస్తే తప్ప సినిమాల్లో నటించడం లేదు. అందులో ముందు వరుసలో

Advertiesment
Patel SIR On July 14th
, బుధవారం, 12 జులై 2017 (15:28 IST)
ఈమధ్య కాలంలో హీరోల కన్నా విలన్లకే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి నిర్మాతలకు ఎదురవుతోంది. గతంలో హీరోలుగా పనిచేసి విలన్లయిన వారు ఎక్కువ డబ్బులిస్తే తప్ప సినిమాల్లో నటించడం లేదు. అందులో ముందు వరుసలో జగపతిబాబు ఉన్నారు. హీరోగా మంచి సినిమాలు చేసిన జగపతిబాబు వయస్సు పైబడటంతో హీరో తండ్రిగానో, హీరోయిన్ తండ్రిగానో నటిస్తున్నారు. 
 
శ్రీమంతుడు, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సినిమాలే కాకుండా ఎన్నో సినిమాల్లో చేసిన జగపతిబాబు నిర్మాతల నుంచి భారీగానే పారితోషికాలు తీసుకున్నారని సినీవర్గాల టాక్. అది కూడా లక్షల్లో కాదు.. ఏకంగా కోట్లలోనే. జగపతిబాబు సినిమాలో నటించాలంటే 2 కోట్లు నిర్మాతలు ఇవ్వాల్సిందేనట. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా. 
 
శ్రీమంతుడు చిత్రం తర్వాత జగపతిబాబు అంత మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారట. ఇప్పటివరకు హీరోలకు మాత్రమే అంత పెద్ద మొత్తంలో నిర్మాతలు డబ్బులిచ్చేవారు. అయితే ఒక క్యారెక్టర్‌ ఆర్టిస్టుకు ఇంత డబ్బులు ఇవ్వడం మాత్రం ఇదే తెలుగు సినీపరిశ్రమలో మొదటిసారి అంటున్నాయి సినీవర్గాలు. 2 కోట్ల రూపాయలు ఇవ్వాలన్న డిమాండ్ పెట్టినా నిర్మాతలు మాత్రం జగపతి బాబుకు అవకాశాలు మీద అవకాశాలు ఇస్తూ అడిగినంత ముట్టచెప్పేస్తున్నారట. పటేల్ సర్ చిత్రం టీజర్ చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీన్ రివర్సైంది... ఛాన్స్‌ కావాలా.. నాతో రాత్రి గడుపు: నటుడికి మహిళా నిర్మాతల పిలుపు